ముంబైలో నడిరోడ్డుపై ఫ్యాన్స్‌తో టీమిండియా క్రికెటర్ పృథ్వీషా ఫైటింగ్ సీన్ సంచలనం రేపుతోంది. సెల్ఫీల కోసం వచ్చిన అభిమానులు గొడవ పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు పృథ్వీషా. ఈ కేసులో ప్రముఖ యూట్యూబర్ స్వప్నా గిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బేస్‌బాల్ బ్యాట్‌తో పృథ్వీనే తనపై దాడి చేశారని స్వప్నా అంటున్నారు.
టీమిండియా క్రికెటర్ పృథ్వీషా కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. సెల్ఫీ ఫోటోలు పృథ్వీషాకు ఆయన అభిమానులకు మధ్య కొట్లాటకు కారణమయ్యింది. ముంబై లోని ఓ స్టార్ హోటల్‌లో పృథ్వీషా తన ఫ్రెండ్స్ కలిసి డిన్నర్ చేస్తుండగా అభిమానులు సెల్ఫీ అడిగారు. సెల్ఫీ అడిగిన వారిలో ప్రముఖ యూట్యూబర్ స్వప్నా గిల్ కూడా ఉన్నారు. వాళ్ల కోరిక మేరకు ఓసారి సెల్ఫీ దిగాడు పృథ్వీషా .. మరోసారి సెల్ఫీ కావాలని ఫ్యాన్స్ అడిగారు. రెండోసారి సెల్ఫీ దిగడానికి పృథ్వీషా ఒప్పుకోకపోవడంతో హోటల్‌లో గొడవ జరిగింది.
హోటల్ నుంచి బయటకు వచ్చిన తరువాత పృథ్వీషాకు , అభిమానులకు మధ్య పెద్ద గొడవ జరిగింది. పృథ్వీషాతో నడిరోడ్డు మీద గొడవకు దిగారు స్వప్నా గిల్. బేస్‌బాల్‌తో కొట్టుకునేందుకు ఇద్దరు ప్రయత్నించారు. ఇదే సమయంలో పృథ్వీషా కారుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు అభిమానులు .. రాళ్ల దాడిలో కారు ధ్వంసమయ్యింది. ఈ ఘటనపై ఓషివారా పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు.
పృథ్వీషా ఇచ్చిన ఫిర్యాదుతో స్వప్నాగిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు ఓశ్వారా పోలీసులు స్వప్నాగిల్‌ను విచారించారు. శుక్రవారం ఆమెను కోర్టులో ప్రవేశపెడుతారు. అయితే పృథ్వీషానే తనపై దాడి చేశారని స్వప్నా గిల్ ఆరోపిస్తున్నారు. అభిమానుల పేరుతో వచ్చినవాళ్లు కారు అద్దాలు పగులకొట్టి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు పృథ్వీషా, అతడి ఫ్రెండ్స్.
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..