IND vs PAK: టీమిండియాతో మ్యాచ్‌కు లైన్ క్లియర్.. ఐసీసీ వార్నింగ్‌తో ఓకే చెప్పిన పాకిస్తాన్..?

India vs Pakistan: పాకిస్తాన్ నుంచి వచ్చిన 3 ప్రధాన డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది. ఇందులో ముఖ్యంగా భారత్ - పాకిస్తాన్ సిరీస్, ట్రై-సిరీస్, టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను అంగీకరించడానికి ఐసీసీ నిరాకరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మధ్య జరిగిన సమావేశం తరువాత, ఈ విషయం ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌కు చేరుకుంది.

IND vs PAK: టీమిండియాతో మ్యాచ్‌కు లైన్ క్లియర్.. ఐసీసీ వార్నింగ్‌తో ఓకే చెప్పిన పాకిస్తాన్..?
2024లో జరిగిన చివరి టీ20 ప్రపంచ కప్‌లో, రెండు జట్లు న్యూయార్క్‌లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 113 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Updated on: Feb 09, 2026 | 9:03 PM

ఎట్టకేలకు పాకిస్తాన్ దిగొచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టుతో ఆడేందుకు ఓకే చెప్పింది. ఐసీసీ వార్నింగ్‌తో దిగివచ్చిన పీసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన 3 ప్రధాన డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది. ఇందులో ముఖ్యంగా భారత్ – పాకిస్తాన్ సిరీస్, ట్రై-సిరీస్, టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను అంగీకరించడానికి ఐసీసీ నిరాకరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మధ్య జరిగిన సమావేశం తరువాత, ఈ విషయం ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌కు చేరుకుంది. తుది ఆమోదం కోసం వేచి ఉంది. ఈ క్రమంలో సూత్రప్రాయంగా పాక్ ప్రభుత్వం భారత జట్టుతో ఆడేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరికొద్దిసేపట్లో అఫిషీయల్ గా పీసీబీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ, పీసీబీ, బీసీబీ ఆదివారం లాహోర్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే.

Follow Us