Sunrisers: ‘మాకు మా గచ్చిబౌలి దివాకర్‌ ఉన్నాడు’… నవ్వులు పూయిస్తోన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్వీట్‌..

|

Feb 04, 2021 | 5:49 AM

Sunrisers Tweet Brahmanandam Photo: సోషల్ మీడియాలో ప్రాసులు, పంచులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ నెటిజెన్లకు సంతోషాన్ని పంచుతున్నారు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..

Sunrisers: మాకు మా గచ్చిబౌలి దివాకర్‌ ఉన్నాడు... నవ్వులు పూయిస్తోన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్వీట్‌..
Follow us on

Sunrisers Tweet Brahmanandam Photo: సోషల్ మీడియాలో ప్రాసలు, పంచులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ నెటిజెన్లకు సంతోషాన్ని పంచుతున్నారు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌ నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైస్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో అమీర్‌ ఖాన్‌, దిలీప్‌ జోషిలతో పాటు క్రికెటర్‌ పాత్రను పోషించిన మరో ఇద్దరి ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌.. ‘ఈ ఏడాది ఐపీల్‌కు వేలంపాటలో ఉన్న కొందరు టాప్‌ క్రికెటర్లు వీరే.. మీకెవరు కావాలి.?’ అని క్యాప్షన్‌ను జోడించింది. అయితే రాజస్థాన్‌ రాయల్స్ పోస్ట్‌ చేసిన ఈ ఫన్నీ పోస్ట్‌పై.. అంతే ఫన్నీగా స్పందించింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. ఈ ట్వీట్‌కు రిప్లైగా ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలోని బ్రహ్మానందం క్రికెట్‌ ఆడుతోన్న జిఫ్‌ ఫైల్‌ను పోస్ట్‌ చేస్తూ.. ‘మేం మా క్రికెటర్‌ను ఇప్పటికే ఎన్నుకున్నం’ అంటూ కామెంట్‌ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ‘గచ్చబౌలి దివాకర్‌’ అనే పాత్రలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read: CSK New Title Sponsor : ఐపీఎల్​లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు టైటిల్​స్పాన్సర్‌గా ‘స్కోడా’..