Breaking News: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి మరోసారి అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చేరిక..

Sourav Ganguly Hospitalised: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ని కుటుంబీకులు...

Breaking News: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి మరోసారి అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చేరిక..

Updated on: Jan 27, 2021 | 4:02 PM

Sourav Ganguly Hospitalised: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ని కుటుంబీకులు హుటాహుటిన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే దీనిపై ఆసుపత్రి వైద్యుల నుంచి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల సౌరవ్ గంగూలీకి గుండెపోటు రావడంతో డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేసిన సంగతి తెలిసిందే. దాని నుంచి పూర్తిగా కోలుకుని గంగూలీ జనవరి 7వ తేదీన వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ‌అటు ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.