గత కొద్ది రోజులుగా.. సీఏఏ, ఎన్నార్సీలకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్కో చోట ఒక్కో రీతిలో ప్రదర్శనలు చేపడుతున్నారు. అయితే మంగళవారం నిరసనకారులు వినూత్న రీతిలో.. అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఆందోళన చేపట్టారు. ఇందుకు వేదికగా.. భారత్ – ఆసీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను ఎంచుకున్నారు. స్టేడియంలో ప్రేక్షకులతో పాటు ఎంటరైన ఆందోళనకారులు.. ‘నో ఎన్‌ఆర్‌సీ’ అని రాసి ఉన్న టీ-షర్ట్‌లు ధరించారు. అంతటితో ఆగకుండా.. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీన్ని గమనించిన అక్కడి ప్రేక్షకులు.. వెంటనే వీరికి కౌంటర్‌గా.. “మోదీ మోదీ” అంటూ నినాదాలు చేశారు. దీంతో వారికి ఏం చేయాలో అర్ధంకాక.. సైలంట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Group of individuals break into a ‘No NPR, No NCR, No CAA’ formation at the Wankhede Stadium in Mumbai.
The crowd in the background chants ‘Modi Modi’. ?? pic.twitter.com/yNNxC7zD8r
— પ્રકાશ | Err ?? (@Gujju_Er) January 14, 2020