Narendra Modi: ‘నేను ముందే చెప్పా’.. కామన్ వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధాని నరేంద్రమోదీ

|

Aug 13, 2022 | 12:39 PM

బర్మింగ్ హామ్ లో జరిగిన కావన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈకార్యక్రమంలో

Narendra Modi: నేను ముందే చెప్పా.. కామన్ వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధాని నరేంద్రమోదీ
Modi Cwg
Follow us on

Narendra Modi: బర్మింగ్ హామ్ లో జరిగిన కావన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈకార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా కామన్ వెల్త్ గేమ్స్ విజేతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. క్రీడాకారుల అనుభవాలను తెలుసుకున్నారు.  ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. కామన్ వెల్త్ క్రీడల ప్రారంభానికి ముందే..తాను చెప్పానని.. బర్మింగ్ హోమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయోగత్సవం జరుపుకుంటామని.. చెప్పిన మాట ప్రకారం విజయంతో తిరిగివచ్చారన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ బిజిగా ఉన్నప్పటికి.. విజేతలందరినీ కలుసుకోవాలనుకున్నానని పేర్కొన్నారు. క్రీడాకారుల స్ఫూర్తిదాయక ప్రదర్శనను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. కామన్ వెల్త్ గేమ్స్ లో చారిత్రాత్మక ప్రదర్శనతో పాటు.. భారత్ తొలిసారి చెస్ ఒలింపియాడ్ ను నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. కామన్ వెల్త్ క్రీడలతో పాటు.. చెస్ ఒలింపియాడ్ లోనూ దేశం పతకాలు సాధించిన క్షణాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయన్నారు. చెస్ ఒలింపియాడ్ విజేతకు ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రితో కామన్ వెల్త్ క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులు గ్రూప్ ఫోటో దిగారు.

ఇప్పటికే ట్విట్టర్ ద్వారా విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి.. ఈరోజు నేరుగా క్రీడాకారులందరిని అభినందించారు.ఇటీవల ముగిసిన కామన్ వెల్త్ క్రీడల్లో 22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలతో మొత్తం 61 పతకాలను సాధించిన భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఏదైనా ముఖ్యమైన ఈవెంట్లలో విజయం సాధించిన భారత క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజేతలను కలిసి..ముచ్చటించడం ఆనవాయితీగా వస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..