US Open 2021: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జకోవిచ్‌కు షాక్ తగిలింది. రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ విజేతగా నిలిచి, తన కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. ఫైనల్‌లో 34 ఏళ్ల జకోవిచ్‌పై 6-4, 6-4, 6-4 తేడాతో విజయం సాధించిన మెద్వెదెవ్.. టెన్నిస్ చరిత్రలో కొత్త చరిత్రను లిఖించాడు. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, అలాగే కేరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించి చరిత్ర తిరగరాద్దమనుకున్న జకోవిచ్‌కు ఆకల నెరవేరకుండానే చేశాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్ మరికొన్ని రోజులు ఆగాల్సిందే. జకోవిచ్ ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, నాదల్ సరసన చేరిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి టెన్నిస్ చరిత్రలో నూతన అధ్యయనాన్ని నెలకొల్పుదామనుకున్న జకోవిచ్‌కు ఈ రష్యా ఆటగాడు నిరాశనే మిగిల్చాడు.
న్యూయార్క్ సిటీలోని ఆర్థర్ ఆషే స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. తొలి సెట్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. తొలిసెట్‌లో 6-4 తేడాతో మెద్వెదెవ్ పైచేయి సాధించాడు. 25 ఏళ్ల మెద్వెదెవ్ 6-4 తేడాతో రెండో సెట్‌ను కూడా గెలిచాడు. ఇక మూడో సెట్‌లో సెర్బియా యోధుడు జకోవిచ్ ఆధిక్యం సాధించలేక తేలిపోయాడు. ఈ సెట్‌లోనూ మెద్వెదెవ్ 6-4 తేడాతో విజయం సాధించాడు. 2019లో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి ఓటమి పాలైన ఈ రష్యా ఆటగాడు.. ప్రస్తుతం టైటిల్ గెలిచాడు. మరోవైపు యూఎస్ ఓపెన్‌లో సింగిల్స్ విభాగంలో ఈసారి ఇద్దరు కొత్త ఛాంపియన్లు టైటిళ్లు సాధించారు. మహిళ సింగిల్స్‌లో 18 ఏళ్ల ఎమ్మా రదుకాను విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
The moment @DaniilMedwed did the unthinkable. pic.twitter.com/rucHjhMA63
— US Open Tennis (@usopen) September 12, 2021
Also Read:
IPL 2021: ఐపీఎల్ చరిత్రలో భయంకరమైన ఓపెనర్లు వీరే.. టాప్ 5లో ఈ బ్యాట్స్‌మెన్‌ని చూసి షాకవుతారంతే?