టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సమరం.. తొలిరోజే అదిరిపోయే స్మాష్‌లు.. రాకెట్లతో సాఫ్ట్‌వేర్ దిగ్గజాల హోరాహోరీ..!

TV9 Corporate Badminton Championship 2026: హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీజన్ 2 అట్టహాసంగా మొదలైంది. నిత్యం కంప్యూటర్ కీబోర్డులతో కుస్తీ పట్టే ఐటీ నిపుణులు, నేడు క్రీడా దుస్తులు ధరించి కోర్టులో స్మాష్‌లతో చెమటోడుస్తున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ క్రీడా సంబరంలో తొలిరోజే సంచలన ఫలితాలు నమోదయ్యాయి.

టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సమరం.. తొలిరోజే అదిరిపోయే స్మాష్‌లు.. రాకెట్లతో సాఫ్ట్‌వేర్ దిగ్గజాల హోరాహోరీ..!
Tv9 Cbc 2026

Updated on: May 15, 2026 | 4:19 PM

TV9 Corporate Badminton Championship 2026: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ టోర్నీ సాగుతోంది. టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ, ఫార్మా, ఇతర కార్పొరేట్ రంగాలకు చెందిన ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్ వంటి సంస్థల ఉద్యోగులు వృత్తిపరమైన ఒత్తిడిని పక్కన పెట్టి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.

తొలిరోజు ఫలితాలు: విజేతల జోరు..

పురుషుల, మహిళల విభాగాల్లో జరిగిన తొలి రౌండ్ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు శిశిర్ గార్గ్, అనిల్ కుమార్, ఇషార్ మీనన్ తమ అద్భుతమైన ఆటతీరుతో తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లారు. అలాగే కాగ్నిజెంట్ తరపున వాసా దీక్షణానందుడు, టీసీఎస్ నుంచి తోకల కౌశిక్ తమ ప్రత్యర్థులపై ఘనవిజయం సాధించారు. గ్లాన్స్ జట్టుకు చెందిన ప్రజ్వల్ 15-7, 15-6 తేడాతో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. మహిళల విభాగంలో శైలజ 15-3, 15-0 తో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి తన సత్తా చాటారు.

హోరాహోరీగా సాగుతున్న పోటీలు..

కేవలం సింగిల్స్ విభాగంలోనే కాకుండా, వివిధ కంపెనీల ప్రతినిధుల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ నుంచి హేమగురు సాయి, ఎంఫాసిస్ నుంచి సిద్దిక్ అలీ షేక్ తమ నైపుణ్యంతో ప్రత్యర్థులను కట్టడి చేశారు. అమెజాన్ ప్రతినిధులు లావి మూల్‌చందాని, లౌహిత్ కూడా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. ఈ పోటీలు కార్పొరేట్ ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపడమే కాకుండా, వారిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే వేదికగా నిలిచాయి.

తదుపరి రౌండ్2కు అర్హత సాధించిన ప్లేయర్లు..

జ్ఞాని- వాస దీక్షానందుడు

మైక్రోసాఫ్ట్- శిశిర్ గార్గ్

Tcs- తోకల కౌశిక్

ఎంఫాసిస్- సిద్ధిక్ అలీ షేక్

HCL టెక్- హేమగురు సాయి

పల్స్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్- శ్రీ కృష్ణ బి

మైక్రోసాఫ్ట్ – అనిల్ కుమార్

నాట్కో రీసెర్చ్ సెంటర్ – ఎస్. సాయి రామ్

సేపియన్స్- శ్రీరంగరాజన్ ఎన్

అమెజాన్- లావి మూల్‌చందాని

మైక్రోసాఫ్ట్ – ఇషార్ మీనన్

VNRVJIET- డా. శైలజ సిమ్మా

FINMKT- S. వర్షిత

మాక్రో గ్రూప్- జ్ఞానేశ్వరి కట్ల

N రంగారావు & సన్స్ PVT LTD- చిన్మయి జమ్మనకట్టి

మైక్రోసాఫ్ట్ – షైలీ జలోరీ

ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్- ప్రియా శర్మ

అమెజాన్- లౌహిత్

దీపక్ నెక్స్‌జెన్ PVT LTD- కె.నరేంద్ర కుమార్

ఇష్- రాజు

మైక్రోసాఫ్ట్ – ప్రణవ జైన్

Nexus IQ సొల్యూషన్స్- సాయి గణేష్

ప్రొవిడెన్స్ ఇండియా- రిషబ్ చౌహాన్

యాక్సెంచర్- మహ్మద్ అమెర్

AKTPL- ప్రవీణ్ కుమార్ మారేడు

FINMKT- బి. ఆశ్రిత్

కాగ్నిజెంట్- రామ్

CDSL- అర్నవ్ భోసలే

మైక్రోసాఫ్ట్ – నిశాంత్ కృష్ణ పి

బ్రిగేడ్ ఎంటర్ LTD- వివేక్ కుమార్

చూపు- ప్రజ్వల్

FINMKT- N సాయి సందీప్

మైక్రోసాఫ్ట్ – అభినవ్ శర్మ

టీం కేటగిరీ పోరుకు సర్వం సిద్ధం..

ప్రస్తుతం ఓపెన్ కేటగిరీ అర్హత రౌండ్లు విజయవంతంగా ముగిశాయి. త్వరలోనే టీమ్ కేటగిరీ పోటీలు ప్రారంభం కానున్నాయి. విజేతలకు భారీ బహుమతులు, ట్రోఫీలను అందించడానికి టీవీ9 నెట్‌వర్క్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాబోయే రెండు రోజుల్లో పోటీ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిర్వాహకులు వెల్లడించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us