Tokyo Paralympics-Bhavnaben Patel: టోక్యో పారా ఒలంపిక్స్ లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినాబెన్ పటేల్ రికార్డ్ నెలకొల్పింది. భవినాబెన్ టేబుల్ టెన్నిస్ విభాగంలో ఫైనల్ లోకి దూసుకెళ్లింది. దీంతో భారత్ నుంచి ఫైనల్ కు చేరిన తొలి ప్యాడ్లర్‌గా చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో వరల్డ్ నంబర్ త్రీ ప్లేయర్ చైనా ప్యాడ్లర్ మియావో జాంగ్ ను 3-2 సెట్స్ తో తేడాతో ఓడించింది.
జాంగ్ పై భవినాబెన్ 7-11, 11-7, 11-4, 9-11, 11-8 స్కోర్ తేడాతో విజయం సొంతం చేసుకుంది. దీంతో ఫైనల్‌కు చేరిన తొలి భారత టీటీ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. కాగా, ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్ వన్ సీడ్, చైనా ప్లేయర్ యింగ్ ఝోతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో భవినాబెన్ ఒకవేళ ఓడినా భారత్‌కు సిల్వర్ మెడల్ దక్కనుంది. దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్న మొట్టమొదటి భారత క్రీడాకారిణిగానూ భవినాబెన్ పటేల్ నిలిచింది.
Also Read: Glowing Skin: సహజమైన ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. నిగనిగలాడే ముఖ వర్చస్సు మీ సొంతం చేసుకోండి..