పారిస్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత పంట పండింది. స్టార్ ఆర్చర్ దీపికా కుమారి అదరగొట్టింది. మహిళల వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల రికర్వ్, మిక్స్‌డ్ విభాగంలో భారత్‌కు బంగారు పతకాలు సాధించి పెట్టింది. మూడో ప్రపంచకప్ స్టేజ్ 3 టోర్నీలో భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి మూడు స్వర్ణ పతకాలతో దుమ్ము రేపింది. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఉత్సాహం నింపే విజయాన్ని అందించింది.
ప్రపంచ నెంబర్ వన్ టీం కొరియా ఈ టోర్నీలో పాల్గొనలేదు. దీంతో భారత ఆర్చర్లకు పెద్ద పోటీ ఎదురు కాలేదనే చెప్పాలి. మహిళ వ్యక్తిగత, టీం, మిక్స్‌డ్ పెయిర్ విభాగాల్లో వరుసగా పసిడి పతకాలు సాధించారు. ఈ అన్ని విభాగాల్లో దీపిక ఉండడం గమనార్హం. వ్యక్తిగత విభాగంలో రష్యా ఆర్చర్ ఎలినా ఒసిపోవాపై 6-0 తేడాతో గెలుపొందింది. ప్రపంచకప్‌లో వ్యక్తిగత విభాగంలో దీపికాకు ఇది రెండో గోల్డ్ మెడల్ కాగా, ఈ రోజు మూడో స్వర్ణం.
Deepika Kumari ?? takes gold in Paris! ??? #ArcheryWorldCup pic.twitter.com/0ZIxSceCFs
— World Archery (@worldarchery) June 27, 2021
అంతకుముందు మిక్స్‌డ్ విభాగంలో దీపికా భర్త అతాను దాస్‌తో కలిసి డచ్ జంటపై విజయం సాధించింది దీపికా జోడీ. గాబ్రియేలా ష్లోసేర్, స్జెఫ్ వాన్ డెన్ బెర్గ్ జంటపై 5-3 తేడాతో గెలుపొందింది.
అంతకుముందు అభిషేక్ వర్మ కాంపౌండ్ విభాగంలో శనివారం బంగారు పతకం సాధించాడు. అలాగే మహిళల రికర్వ్ విభాగంలో దీపికా, అంకితా భకత్, కోమాలిక బరి బృందం సైతం మెక్సికో టీంపై అలవోకగా విజయం సాధించి పసిడిని సొంతం చేసుకున్నారు.