Maria Sharapova: తల్లి కాబోతున్న టెన్నిస్ తార మరియా షరపోవా.. నెట్టింట వైరలవుతోన్న బేబీ బంప్ ఫొటోలు

|

Apr 20, 2022 | 9:01 PM

రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా తల్లి కాబోతోంది. ఆమె బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఈ సమాచారాన్ని తన అభిమానులకు అందించింది.

Maria Sharapova: తల్లి కాబోతున్న టెన్నిస్ తార మరియా షరపోవా.. నెట్టింట వైరలవుతోన్న బేబీ బంప్ ఫొటోలు
Maria Sharapova
Follow us on

రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా(Maria Sharapova) తల్లి కాబోతోంది. ఆమె బేబీ బంప్(Sharapova Pregnancy) ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఈ సమాచారాన్ని తన అభిమానులకు అందించింది. తన పుట్టినరోజు రోజైన ఏప్రిల్ 19న ఈ ఫోటోను షేర్ చేసింది. ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ విజేత షరపోవా ఏప్రిల్ 19న 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడిన తర్వాత టెన్నిస్ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. ఆమె రిటైర్మెంట్ పట్ల అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

పదవీ విరమణ తర్వాత రష్యన్ బ్యూటీ మాట్లాడుతూ, ‘మీకు తెలిసిన ఏకైక జీవితాన్ని మీరు ఎలా వదిలివేయగలరు? చిన్నప్పటి నుంచి శిక్షణ తీసుకుంటున్న కోర్టుల నుంచి ఎలా దూరమవుతారు? అంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. షరపోవా 2018 నుంచి బ్రిటిష్ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్క్స్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. అలెగ్జాండర్ ఆర్ట్ డీలర్ కూడా. తమకు డిసెంబర్ 2020లో నిశ్చితార్థం జరిగిందని మరియా వెల్లడించింది. నిశ్చితార్థానికి ముందు, 42 ఏళ్ల అలెగ్జాండర్, మరియా షరపోవా ప్రతి మ్యాచ్‌ను చూడటానికి కోర్టుకు హాజరయ్యేవాడు. ఇద్దరూ చాలాసార్లు కలిసి కనిపించారు. రెండేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత, ఇద్దరూ డిసెంబర్ 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు కాబోతున్నారు.

షరపోవా 2004లో 17 ఏళ్ల వయసులో వింబుల్డన్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది. 2012లో ఫ్రెంచ్ ఓపెన్‌లో కెరీర్ స్లామ్ విజయాన్ని కూడా పూర్తి చేసింది. 2012 తర్వాత 2014లో ఫ్రెంచ్ ఓపెన్‌ని కూడా కైవసం చేసుకుంది. ఆమె 2006లో US ఓపెన్, 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుపొందడంలో విజయం సాధించింది. 2016లో డోపింగ్‌ కారణంగా షరపోవాపై 15 నెలల నిషేధం విధించారు. ఏప్రిల్ 2017లో తిరిగి వచ్చింది.

Also Read: Highest Earners in IPL: ధోని నుంచి రోహిత్ వరకు.. IPL చరిత్రలో అత్యధికంగా సంపాదించింది వీళ్లే..

IPL 2022: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్