Tiger Woods Car Accident: ప్రముఖ గోల్ఫ్ స్టార్ టైగర్‌వుడ్స్ కొన్ని నెలల క్రితం కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన కారు బాగా డ్యామేజ్ అయ్యింది. అంతేకాకుండా టైగర్‌వుడ్స్ తన కాలు కూడా విరగొట్టుకున్నాడు. ఈ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు టైగర్‌వుడ్స్.
ఇదిలా ఉంటే తాజాగా అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న కారణాలు వెతికే పనిలో పడ్డ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద సమయంలో టైగర్ వుడ్స్ ఏకంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు తేలింది. కారు అదుపు తప్పి పల్టీ కొట్టడానికి ఇదే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రమాదం జరిగిన ఆ ప్రదేశంలో గంటకు కేవలం 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉంది. కానీ టైగర్ వుడ్స్ దానికి రెట్టింపు వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని తేలింది. అయితే పరిమితికి మించిన వేగంతో వెళ్లినట్లు తేలినా.. అక్కడ పోలీసు అధికారులుగానీ, ప్రత్యక్ష సాక్షులుగానీ లేకపోవడంతో టైగర్‌వుడ్స్‌పై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు చేయడం లేదు. ఒకవేళ ఈ ప్రమాదం జరిగిన సమయంలో మరో వ్యక్తి ఉండి ఉంటే విచారణ కొనసాగించే వాళ్లమని పోలీసులు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న జరిగిన ఈ ప్రమాదంలో వుడ్ తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే.
Also Read: IPL 2021: ధోనిసేన స్ట్రాంగ్ ప్లేయింగ్ ఎలెవన్.. ‘తలా’ వేట మాములుగా ఉండదు.. ఈసారి ట్రోఫీ ఖాయం.!
IPL 2021: ఫైర్ మీదున్న రిషబ్ పంత్.. తొలి టైటిలే లక్ష్యంగా వేట.. మరి బోణీ కొట్టేనా.!