ప్రపంచవ్యాప్తంగా పక్షులతో రేసులు నిర్వహించడం పెద్ద ఫ్యాషన్. అంతే కాదు ఈ పక్షులపై బెట్టింగులు పెట్టడం.. కోట్ల రూపాయలు చేతులు మారడం అక్కడ కామన్. అయితే తాజాగా బ్రిటన్‌లో జరిగిన పావురాల రేసు పెద్ద చర్చకు దారి తీసింది. చర్చ అంటే వారిపై కేసులు పట్టడం… వాటిని రక్షించడం అలాంటిది కాదు.. ఆ పోటీలో వారు ఉపయోగించని పది వేలకు పై పక్షలు ఒక్కసారిగా కనిపించకుండా పోయాయి. అసలు కథేంటో ఇక్కడ చూద్దాం…బ్రిటన్‌లో పావురాల రేసులు నిర్వహించడం చాలా ఖరీదైన ఆట..ఈ పావురాల రేసు సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రేసు కోసం గాల్లోకి ఎగిరిన 10 వేల పావురాలలో సగం పావురాలు తిరిగి రాలేదు.
శనివారం బ్రిటన్ లోని పీటర్ బరోలో 270 కిమీ పావురాల రేసు జరిగింది. సాధారణ పరిస్థితుల్లో గాల్లోకి ఎగిసిన పావురాలు చేరుకోవాల్సిన టార్గెట్‌కు రీచ్ కావల్సి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి తమ యజమానుల వద్దకు చేరాల్సి ఉంటుంది. కానీ, ఈ పదివేల పావురాలు ఆచూకీ లేకుండా పోవడం వాటి యజమానులను, రేసు నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇదిలావుంటే బ్రిటన్ లో ఎక్కడిక్కడ తుపాను పరిస్థితులు సంభవిస్తుంటాయని, వాటి కారణంగానే పావురాలు దారితప్పి ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తోంది. తమ పావురాలను ఎవరైనా గుర్తిస్తే వాటికి నీరు, ఆహారం అందించాలని వాటి యజమానులు ప్రకటనలు ఇస్తున్నారు. వాటిన పట్టుకునేందుకు అవి వెళ్లిన దారిలో వీరు కూడా ప్రయాణం మొదలు పెట్టారు.
అయితే వీరు ఎక్కడ వెతికినా అవి కనిపించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని గుర్తించేందుకు రేసుల్లో పాల్గొనే పావురాలు కాళ్లకు వేర్వేరు రంగులతో ఉండే రింగులను తొడుగుతుంటారు అందుకే అవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. వీటిని గుర్తించడం కూడా చాలా తేలికే. ఇవి మామూలు పావురాలతో పోల్చితే ఎంతో దృఢంగా ఉంటాయి.