Women’s World Boxing : ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిఖత్‌ జరీన్‌

|

Updated on: May 19, 2022 | 9:34 PM

Nikhat Zareen vs Jutamas Jitpong live stream: తెలంగాణ బిడ్డ.. ప్రపంచ బాక్సింగ్‌ పోటీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.

Women's World Boxing : ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిఖత్‌ జరీన్‌
Nikhat Zareen

తెలంగాణ బిడ్డ.. ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ 52 కేజీల విభాగంలో నిఖత్‌ జరీన్‌ విజయం సాధించింది. ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్‌పై ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీస్‌ పోటీల్లో ఆమె బెస్ట్ బాక్సర్ ఛాంపియన్ షిప్ సాధించింది. విశాఖపట్నంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బాక్సింగ్‌ శిక్షణ తీసుకుంది. నిఖత్‌ ప్రముఖ బాక్సర్‌ మేరీకోమ్‌ను స్పూర్తిగా తీసుకొని బాక్సింగ్‌లో దూసుకుపోతోంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 May 2022 09:08 PM (IST)

    నిఖత్‌ జరీన్‌ అద్భుత విజయం

    ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ విజేతగా తెలంగాణ  బిడ్డ..

  • 19 May 2022 09:01 PM (IST)

    దూకుడుగా ఆడుతున్న జరీన్‌

    ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ నిఖత్‌ జరీన్‌ దూకుడుగా ఆడుతోంది.

  • 19 May 2022 08:38 PM (IST)

    ప్రారంభమైన మ్యాచ్‌

    ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. థాయ్‌లాండ్‌కు చెందిన బాక్సర్‌తో నిఖత్‌ జరీన్‌ తలపడుతోంది.

  • 19 May 2022 08:11 PM (IST)

    మరికొన్ని క్షణాల్లో ఫైనల్‌ ఫైట్‌

    నిఖత్‌ జరీన్‌ మరికొన్ని క్షణాల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్‌తో ఫైనల్‌ ఆడనుంది.

Published On - May 19,2022 8:10 PM

Follow us