క్రికెట్‌ కన్నా ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ క్రీడాపోటీలు అతి పెద్దవి: సెహ్వాగ్‌

| Edited By:

Aug 30, 2019 | 4:55 AM

క్రికెట్‌తో పోలిస్తే కామన్‌వెల్త్‌, ఒలింపిక్స్‌ పోటీలు అతి పెద్దవని టీమిండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కానీ అథ్లెట్లకు మాత్రం అందాల్సినంతగా సౌకర్యాలు అందడం లేదని వాపోయాడు. నగరంలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అతడు మాట్లాడాడు. ‘క్రికెట్‌ కన్నా ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ క్రీడాపోటీలు అతి పెద్దవని అనుకుంటాను. అందులో పాల్గొనే అథ్లెట్లను జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తాను. వారికి నిపుణులైన శిక్షకులు, ఫిజియోలతో పాటు మంచి ఆహారం, పోషకాలు అందాలని కోరుకుంటాను. నిజానికి వారిని […]

క్రికెట్‌ కన్నా ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ క్రీడాపోటీలు అతి పెద్దవి: సెహ్వాగ్‌
Follow us on

క్రికెట్‌తో పోలిస్తే కామన్‌వెల్త్‌, ఒలింపిక్స్‌ పోటీలు అతి పెద్దవని టీమిండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కానీ అథ్లెట్లకు మాత్రం అందాల్సినంతగా సౌకర్యాలు అందడం లేదని వాపోయాడు. నగరంలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అతడు మాట్లాడాడు.

‘క్రికెట్‌ కన్నా ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ క్రీడాపోటీలు అతి పెద్దవని అనుకుంటాను. అందులో పాల్గొనే అథ్లెట్లను జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తాను. వారికి నిపుణులైన శిక్షకులు, ఫిజియోలతో పాటు మంచి ఆహారం, పోషకాలు అందాలని కోరుకుంటాను. నిజానికి వారిని కలిసినప్పుడు క్రికెటర్లకున్న వసతులు, సౌకర్యాల్లో 10 లేదా 20 శాతమూ వారికి దక్కడం లేదని తెలిసింది. అయినా వారు పతకాలు గెలుస్తున్నారు. వారు దేశానికి పతకాలు అందిస్తున్నారు కాబట్టి ఇప్పటి కన్నా ఎక్కువ పొందడానికి వారు అర్హులు’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

‘క్రికెటర్ల జీవితాల్లో కోచ్‌లు కీలక పాత్ర పోషిస్తారు. కానీ వారికి ఇవ్వాల్సినంత ఘనతను మేం ఇవ్వం. మాతోనే ఉంచుకుంటాం. అథ్లెట్లు అలా ఉండరు. క్రికెటర్లు కోచ్‌లను త్వరగా మర్చిపోతారు. ఎందుకంటే గురువులతో వారు ఎక్కువగా మాట్లాడరు. కలవరు. కానీ ఇతర క్రీడల్లో ఆటలో ఓనమాలు మొదలుపెట్టిన దగ్గర్నుంచి చాలాకాలం క్రీడాకారులు గురువులతోనే ఉంటారు’ అని వీరూ వెల్లడించాడు.