MS Dhoni: ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై.. ఇకపై కొత్త అవతారంలో తల..

ఒక శకం ముగిసింది.. క్రికెట్ మైదానంలో ఆ అరుదైన దృశ్యం ఇక కనిపించదు.. పసుపు రంగు జెర్సీతో, ఆ కూల్ కెప్టెన్సీతో కోట్లాది మంది గుండెల్లో నిలిచిన తల ఎంఎస్ ధోని ఐపీఎల్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. అయితే సీఎస్‌కే అభిమానులకు ఊరటనిస్తూ ధోని సరికొత్త బాధ్యతలతో మైదానంలోకి అడుగుపెడుతున్నాడు.

MS Dhoni: ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై.. ఇకపై కొత్త అవతారంలో తల..
Ms Dhoni Retires From Ipl, Joins Csk As Team Mentor

Updated on: Nov 17, 2026 | 3:21 PM

భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ఇకపై సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఐపీఎల్ 2027 సీజన్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టీమ్ మెంటార్ బాధ్యతలు చేపట్టనున్నాడు. గ్రౌండ్‌లో ఆటగాడిగా ఆయన రోల్ మారినప్పటికీ, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే ఫ్రాంచైజీతో ధోని అనుబంధం మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరదని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

సీఎస్‌కే అంటేనే ధోని – ఎన్. శ్రీనివాసన్ భావోద్వేగం

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి, ఎంఎస్‌ ధోనికి మధ్య ఉన్న విడదీయరాని బంధం గురించి సీఎస్‌కే యజమాని ఎన్. శ్రీనివాసన్ ప్రత్యేకంగా మాట్లాడారు. జట్టు గుర్తింపులో ధోని ఎప్పుడూ ప్రధాన కేంద్రంగా ఉంటారని స్పష్టం చేశారు. మైదానంలో తన ఐకానిక్ షాట్లు, కూల్ కెప్టెన్సీతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ధోని, ఇకపై మెంటార్‌గా డగ్‌అవుట్‌లో నిలవనున్నారు. ఆటగాడిగా రిటైర్ అయినప్పటికీ, జట్టును విజయపథంలో నడిపించడంలో, యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయడంలో ఆయన అనుభవం సీఎస్‌కేకు ఎంతో శ్రీరామరక్షగా మారనుంది. మొత్తానికిః, ఆటగాడిగా వీడ్కోలు పలికినప్పటికీ ఎల్లో ఆర్మీతో ధోని ప్రయాణం మరింత బలంగా కొనసాగుతుండటంతో చెన్నై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెంటార్‌గా ధోని రాకతో సీఎస్‌కే శిబిరంలో నూతనోత్సాహం సంతరించుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us