ధోనీతో ‘బంతాట ఆడని శ్యామ్’ ! ఇదెక్కడి అలక ?

ఈ మధ్య ఎందుకో ‘తలా’ ముభావంగా ఉంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా రాంచీ లోని తన ఫామ్ హౌస్ లోనే ఫ్యామిలీతో గడుపుతున్నాడు. అయితే సరదా మూడ్ లో మాత్రం లేడు. చెన్నై సూపర్ కింగ్స్ తీసిన వీడియో చూస్తే ఈ విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది. ఈ వీడియోలో ధోనీ భార్య సాక్షి సింగ్, వారి ముద్దుల కూతురు జీవా ధోనీ తమ పెంపుడు శునకం ‘శ్యామ్’ తో సరదాగా ఆడుతుంటే ఆయన మాత్రం డల్ […]

ధోనీతో బంతాట ఆడని శ్యామ్ ! ఇదెక్కడి అలక ?

Edited By:

Updated on: May 12, 2020 | 7:26 PM

ఈ మధ్య ఎందుకో ‘తలా’ ముభావంగా ఉంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా రాంచీ లోని తన ఫామ్ హౌస్ లోనే ఫ్యామిలీతో గడుపుతున్నాడు. అయితే సరదా మూడ్ లో మాత్రం లేడు. చెన్నై సూపర్ కింగ్స్ తీసిన వీడియో చూస్తే ఈ విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది. ఈ వీడియోలో ధోనీ భార్య సాక్షి సింగ్, వారి ముద్దుల కూతురు జీవా ధోనీ తమ పెంపుడు శునకం ‘శ్యామ్’ తో సరదాగా ఆడుతుంటే ఆయన మాత్రం డల్ గా పచ్చిక మీద కూర్చున్నాడు. సాక్షి ఆలా బంతి విసరగానే..’శ్యామ్’ పరుగున వెళ్లి నోటితో పట్టుకుని తెస్తే.. ధోనీ మూడ్ గమనించిందో ఏమో.. అతని బంతికి రెస్పాండ్ కాకుండా అతని దగ్గరే తచ్చాడింది. కాసేపు ఆ ఆట అయ్యాక ధోనీ కామ్ గా తనకు తాను  ఒంటరిగా వెళ్ళిపోయాడు.