వలస కూలీల కోసం ముందుకొచ్చిన షమీ.. నెటిజన్ల ప్రశంసలు..!

| Edited By:

Jun 02, 2020 | 4:47 PM

కరోనా లాక్‌డౌన్‌ వేళ ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

వలస కూలీల కోసం ముందుకొచ్చిన షమీ.. నెటిజన్ల ప్రశంసలు..!
Follow us on

కరోనా లాక్‌డౌన్‌ వేళ ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వీరిలో నటుడు సోనూసూద్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే వేలాది మంది వలస కూలీలను స్వగ్రామాలకు పంపిన సోనూసూద్ వారి పట్ల రియల్ హీరోగా వెలుగొందుతున్నారు. ఇక తాజాగా వలస కార్మికుల కోసం ముందడుగు వేశారు టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ.

ఉత్తరప్రదేశ్‌లో ఆయన వలస కూలీలకు కూలీలకు ఆహారం, నీళ్లు, అరటి పండ్లు, మాస్క్‌లను ఆయన అందించారు. అంతేకాదు రోడ్డు పక్కన టెంట్ వేసుకుని నివసిస్తోన్న కూలీలకు సైతం షమీ ఆహారం, నీళ్లను అందించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ వీడియోలను షేర్ చేసిన బీసీసీఐ.. ”వలస కూలీలను ఆదుకునేందుకు షమీ ముందుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని జాతీయ రహదారి 24లో వలస కూలీలకు షమీ ఆహారం, మాస్క్‌లను అందజేశారు. ఆయన నివాసం ఉంటున్న సాహస్‌పూర్‌లో సైతం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మేమంతా కలిసి చేస్తున్నాం” అని కామెంట్ చేసింది. ఇక షమీ చేస్తున్న సాయంపై నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read This Story Also: కూరగాయల వ్యాపారి ద్వారా 26 మందికి కరోనా..!