ఐపీఎల్ 2021: స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను వదులుకున్న రాజస్థాన్.. కొత్త కెప్టెన్‌గా సంజూ శాంసన్..

|

Jan 20, 2021 | 7:58 PM

IPL 2021: ఐపీఎల్ 2021కి ముందు మినీ వేలం ఉండటంతో ఫ్రాంచైజీలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ తరుణంలోనే రాజస్థాన్ రాయల్స్...

ఐపీఎల్ 2021: స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను వదులుకున్న రాజస్థాన్.. కొత్త కెప్టెన్‌గా సంజూ శాంసన్..
Follow us on

IPL 2021: ఐపీఎల్ 2021కి ముందు మినీ వేలం ఉండటంతో ఫ్రాంచైజీలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ తరుణంలోనే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు షాక్ ఇస్తూ అతడిని జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

అంతేకాకుండా నూతన కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసింది. యువ ఇండియన్ ప్లేయర్ సారధ్యంలో రాజస్థాన్ టీం ఈ ఏడాది ఐపీఎల్‌కు బరిలోకి దిగుతుంది. అటు శ్రీలంక మాజీ క్రికెట్ కుమార సంగక్కరను టీం డైరెక్టర్‌గా నియమించడంతో ఆర్ఆర్.. ఐపీఎల్ 14లో తమ లక్‌ను పరీక్షించుకునేందుకు సిద్దమైంది.!