ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రేపు షెడ్యూల్‌ విడుదల

ఐపీఎల్‌ 13వ సీజన్ షెడ్యూల్ కోసం అటు ఫ్రాంఛైజీలతో పాటు ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రేపు షెడ్యూల్‌ విడుదల
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2020 | 4:06 PM

IPL 2020 updates: ఐపీఎల్‌ 13వ సీజన్ షెడ్యూల్ కోసం అటు ఫ్రాంఛైజీలతో పాటు ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షెడ్యూల్‌ని శుక్రవారం విడుదల చేస్తామంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆ మధ్యన ప్రకటించగా.. నిన్న బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అటు సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడారు.

యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 2020 షెడ్యూల్ సోమవారం విడుదల అవుతుందని బ్రిజేష్ తెలిపారు. అయితే చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌లో 13 మందికి కరోనా సోకడంతో.. షెడ్యూల్‌ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా కరోనా నేపథ్యంలో ఈ సీజన్‌ని యూఏఈలోని దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఈ సీజన్ జరగనుంది. 53 రోజుల పాటు సాగే ఈ టోర్నమెంట్‌లో మధ్యాహ్నం మ్యాచ్‌లు గం.3.30ని.లకు, సాయంత్రం మ్యాచ్‌లు రాత్రి గం.7.30లకు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Read More:

సుశాంత్ కేసు: వారంతా బాలీవుడ్ గ్యాంగ్‌స్టర్‌లు

విషాదం.. 59ఏళ్ల కరోనా బాధితురాలు ఆత్మహత్య