భారత పర్యటనలో బంగ్లాదేశ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో.. ఫస్ట్ టీ20 మ్యాచ్ జరగనుంది. గత కొంత కాలంగా రెస్ట్ లేని క్రికెట్ ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. తాజాగా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. నొప్పితో వెంటనే డ్రస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. విక్రమ్ రాథోడ్, సెనెవిరత్నే ఆపడానికి ప్రయత్నం చేసినా రోహిత్ మైదానంలో ఉండలేదు. దీంతో బీసీసీఐకు టెన్షన్ మొదలైంది.
గాయమైన తర్వాత రోహిత్ తిరిగి ప్రాక్టీస్‌కు రాలేదు. ‘రోహిత్ చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు రాగానే మీడియాకు వెల్లడిస్తాం’ అని జట్టు వర్గాలు తెలిపాయి. కాకపోతే అతడు మ్యాచ్ ఆడతాడా అనే విషయంపై మాత్రం నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కాగా తొలి టీ20లో కీపింగ్ రిషభ్‌పంతే చేస్తాడన్న టాక్ నడుస్తోంది. సంజు శాంసన్ ఆటగాళ్లతో కలిసి ఫీల్డింగ్ చేయగా.. పంత్ గ్లోవ్స్ ధరించి ఎక్కువ సేపు సాధన చేశాడు.