India vs England 4th Test: ముగిసిన రెండో రోజు ఆట.. పట్టు బిగిస్తున్న టీమిండియా.. ఇంగ్లాండ్‌పై ఎంత ఆధిక్యంలో ఉందంటే..?

|

Mar 05, 2021 | 6:33 PM

India vs England 4th Test - Day 2 Highlights: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆధిక్యం వైపు దూసుకుపోతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆధిక్యంలో ఉంది. రిష‌బ్ పంత్(101) సెంచ‌రీ చేసి..

India vs England 4th Test: ముగిసిన రెండో రోజు ఆట.. పట్టు బిగిస్తున్న టీమిండియా.. ఇంగ్లాండ్‌పై ఎంత ఆధిక్యంలో ఉందంటే..?
India vs England 4th Test - Day 2 Highlights
Follow us on

India vs England 4th Test – Day 2 Highlights: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆధిక్యం వైపు దూసుకుపోతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆధిక్యంలో ఉంది. రిష‌బ్ పంత్(101) సెంచ‌రీ చేసి ఆకట్టుకోగా.. ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ (60 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీ చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భారత జట్టు 7 వికెట్ల‌కు 294 ప‌రుగులు చేసింది. దీంతో ప్ర‌స్తుతం తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి సేన‌ ఇంగ్లాండ్‌పై 89 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో సుంద‌ర్‌, అక్ష‌ర్ ప‌టేల్ (11) ఉన్నారు. పంత్ ఔటైన త‌ర్వాత కూడా ఈ ఇద్ద‌రూ ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నారు. ఎనిమిదో వికెట్‌కు ఇప్ప‌టికే 35 ప‌రుగులు జోడించారు.

అంత‌కుముందు మిడిలార్డ‌ర్ విఫ‌ల‌మ‌వ‌డంతో ఒక ద‌శలో టీమిండియా 146 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో.. కెప్టెన్ కోహ్లి (0)తోపాటు ర‌హానే (27), అశ్విన్ (13), పుజారా (17) విఫ‌ల‌మ‌య్యారు. రోహిత్ శర్మ 49 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ సమయంలో పంత్‌, సుంద‌ర్ టీమ్‌ను ఆదుకున్నారు. అయితే ఆధిక్యం సాధ్య‌మేనా అనిపించినా.. ఈ ఇద్ద‌రూ ఏడో వికెట్‌కు 113 ప‌రుగులు జోడించి కీల‌క‌మైన ఆధిక్యాన్ని సంపాదించారు. ఈ క్ర‌మంలో పంత్ టెస్టుల్లో మూడో సెంచరీ చేయ‌గా.. సుంద‌ర్ మూడో హాఫ్ సెంచ‌రీ చేశాడు. మొద‌ట్లో వికెట్ కాపాడుకునే ఉద్దేశంతో నెమ్మ‌దిగా ఆడిన పంత్‌.. హాఫ్ సెంచ‌రీ పూర్తియ‌న త‌ర్వాత స్పీడు పెంచాడు. అండర్సన్ వేసిన ఓవర్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పంత్ రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే అదే రూట్‌ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మ‌రీ పంత్ సెంచ‌రీ పూర్తి చేయ‌డం విశేషం.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. 205ల పరుగులకు అలౌట్‌ అయ్యింది. ఒక దశలో 30 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లాండ్ జట్టు.. బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో ఊపిరిపోశాడు. అయితే అనంతరం కూడా భారత బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్‌ ప్లేయర్స్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. లోకల్‌ బాయ్‌ అక్షర్‌ పటేల్‌ నాలుగో టెస్టులోనూ అద్భుతంగా రాణించాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌కు గట్టి దెబ్బ కొట్టాడు. ఇక గత మూడు మ్యాచ్‌లలో తన స్పిన్‌తో మాయ జాలం చేసిన అశ్విన్‌ నాలుగో టెస్ట్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. హైదారాబాదీ ప్లేయర్‌ సిరాజ్‌ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ను పడగొట్టాడు.

 

Also Read:

వరుసగా ఆరు సిక్స్ లు.. వైరల్ గా మారిన పొలార్డ్ వీడియో : Kieron Pollard six’s viral video.

ఫాస్ట్ బౌలర్ ఫాస్ట్ గా పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు..పెళ్లి కొరకే సెలవు కోరిన బుమ్రా : Jasprit Bumrah likely to get married Video