Oliver Kahn: ప్రపంచ ఫుట్‌బాల్‌ వేదికపై భారత్‌ శక్తిగా ఎదగడం ఖాయం.. ఆలివర్‌ ఖాన్‌ ధీమా..

|

Nov 25, 2023 | 1:24 PM

ఈ క్రమంలోనే ప్రపంచ ఫుట్‌బాల్‌ వేదికపై భారత్‌ను బలీయమైన శక్తిగా నిలిపేందుకు తన మద్ధతు ఉంటుందని తెలిపారు. శుక్రవారం ముంబయిలో జీడీ సోమాని పాఠశాలను సందర్శించి ఖాన్‌, విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్భంగా ఖాన్‌ మాట్లాడుతూ.. ఫుట్‌బాల్‌లో భారత్‌కు అపారైన సామర్థ్యం ఉందన్నారు. త్వరలో ప్రపంచ ఫుట్‌బాల్ వేదికపై బలీయమైన శక్తిగా అవతరించనుందని అన్నారు...

Oliver Kahn: ప్రపంచ ఫుట్‌బాల్‌ వేదికపై భారత్‌ శక్తిగా ఎదగడం ఖాయం.. ఆలివర్‌ ఖాన్‌ ధీమా..
Oliver Kahn
Follow us on

జర్మీన్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం ఆలివర్‌ ఖాన్‌ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. సుమారు 15 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ భారత్‌కు వచ్చాడు. 2008లో కోల్‌కతాలో చివరి మ్యాచ్‌ ఆడిన ఆలివర్‌ ఖాన్‌ ఇప్పుడు తిరిగి భారత్‌కు వచ్చాడు.

ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఫుట్‌బాల్‌ గేమ్‌కు మరింత ఆదరణ పెరిగే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్‌లో అకాడమీని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన ఆలివార్‌.. మహారాష్ట్రలో ప్రో 10 భాగస్వామ్యంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు.

ఇక ఈ క్రమంలోనే ప్రపంచ ఫుట్‌బాల్‌ వేదికపై భారత్‌ను బలీయమైన శక్తిగా నిలిపేందుకు తన మద్ధతు ఉంటుందని తెలిపారు. శుక్రవారం ముంబయిలో జీడీ సోమాని పాఠశాలను సందర్శించిన ఖాన్‌.. విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్భంగా ఖాన్‌ మాట్లాడుతూ.. ఫుట్‌బాల్‌లో భారత్‌కు అపారైన సామర్థ్యం ఉందన్నారు. త్వరలో ప్రపంచ ఫుట్‌బాల్ వేదికపై బలీయమైన శక్తిగా అవతరించనుందని అన్నారు. ఫుట్‌బాల్‌లో భారత్‌కు అపారమైన సామర్థ్యం ఉందన్న ఆయన, భారత్‌లో ప్రజలకు ఫుట్‌బాల్‌లో ఉన్న అభిరుచి అపురూపమైందని అభిప్రాయపడ్డారు.

భారత దేశం తన గొప్ప సంస్కృతిని అందమైన ఫుట్‌బాల్‌ గేమ్‌తో మిళితం చేస్తూ తన సొంత మార్గాన్ని రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందనన్నారు. ప్రపంచ ఫుట్‌బాల్‌ వేదికపై భారత్‌ త్వరలోనే ప్రపంచకప్‌లో బలీయమైన శక్తిగా అవతరిస్తుందని తాను బలంగా నమ్ముతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇక ఫుట్‌బాల్‌ అనేది కేవలం ఆట మాత్రమే కాదన్న ఖాన్‌.. అదొక జీవన విధానంగా అభివర్ణించారు. తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, తనకు పట్టుదల విలువను నేర్పాయన్నారు. ‘నెవర్‌ గివప్‌’ అనేది తన జీవిత సిద్ధాంతమన్న ఆలివార్‌ ఖాన్‌.. నిబద్ధతో ప్రయత్నిస్తే విజయం వస్తుందని యువతకు స్ఫూర్తినిచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..