సిరీస్ టీమిండియాదే.. మూడవ టీ20లో భారత్ ఘన విజయం!

ముంబైలో జరుగుతున్న మూడవ టీ 20 లో భారతదేశం విజయం సాధించింది. ఆతిథ్య జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ మొదటి 10 ఓవర్లలోనే 100 పరుగులకు పైగా జోడించి భారత్‌కు పటిష్టమైన ఆరంభం ఇచ్చారు. రోహిత్ 71 పరుగులు, 91 పరుగులకు రాహుల్ నిష్క్రమించగా, విరాట్ కోహ్లీ అజేయంగా నిలిచాడు. 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ ఒత్తిడికిలోనై త్వర త్వరగా […]

సిరీస్ టీమిండియాదే.. మూడవ టీ20లో భారత్ ఘన విజయం!

Edited By:

Updated on: Dec 12, 2019 | 12:44 AM

ముంబైలో జరుగుతున్న మూడవ టీ 20 లో భారతదేశం విజయం సాధించింది. ఆతిథ్య జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ మొదటి 10 ఓవర్లలోనే 100 పరుగులకు పైగా జోడించి భారత్‌కు పటిష్టమైన ఆరంభం ఇచ్చారు. రోహిత్ 71 పరుగులు, 91 పరుగులకు రాహుల్ నిష్క్రమించగా, విరాట్ కోహ్లీ అజేయంగా నిలిచాడు. 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ ఒత్తిడికిలోనై త్వర త్వరగా వికెట్లు చేజార్చుకుంది.