రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. కివిస్ పై ఎనిమిది వికెట్ల తేడాతో రోహిత్ సేన మరో విజయాన్ని ఖాతాలో నమోదు చేసుకుంది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్ 20.1 ఓవర్లలో ఛేదించి.. భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (51; 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ.. మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతని నమ్మకాన్ని నిలబెట్టాడు బౌలర్ షమి. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ అలెన్‌ను బౌల్డ్ చేశాడు. అక్కడి నుంచి కివీస్ పతనం ప్రారంభమైంది. 15 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను.. మిడిలార్డర్ బ్యాటర్లు ఫిలిప్స్, బ్రాస్‌వెల్, శాంట్‌నర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీళ్లు ముగ్గురు తప్పితే.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.
దీంతో అతి కష్టం మీద 34.3 ఓవర్లకు.. 108 పరుగులు చేసింది న్యూజిలాండ్. న్యూజిలాండ్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్ (36) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మైఖేల్ బ్రాస్‌వెల్ (22), మిచెల్ శాంటర్న్ (27) పరుగులు మాత్రమే చేశారు. భారత్ బౌలర్లలో షమి 3 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.
చిన్న టార్గెట్‌ను చేధించేందుకు రంగంలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు.. ప్రత్యర్థి బౌలర్లను ఏమాత్రం లెక్కచేయలేదు. రోహిత్‌శర్మ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తిచేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నింపాదిగా ఆడాడు. అయితే.. రోహిత్ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌కోహ్లీ ఎక్కువసేపు క్లీజ్‌లో నిలబడలేదు. 11 రన్స్ మాత్రమే చేశాడు.
India beat New Zealand by 8 wickets in the second ODI in Raipur to take an unassailable 2-0 lead in the three-match series.
(Pic: BCCI) pic.twitter.com/5YJ0uDZCEF
— ANI (@ANI) January 21, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..