
T20 Worldcup 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డన్ డకౌట్ కావడంతో భారత క్రికెటర్ రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లోనూ హిట్ మ్యాన్ నిరాశపరిచాడు. మూడో ఓవర్లో కిషన్(4) ఔట్ అయ్యాక వన్ డౌన్లో రోహిత్ శర్మ బరిలోకి వచ్చాడు. మూడో ఓవర్ చివరి బంతికి రోహిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి బ్రతికిపోయాడు. రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను ఆడమ్ మిల్నే జారవిడవడంతో రోహిత్ శర్మకు లక్కీ లైఫ్ దక్కింది. రోహిత్‌కు లైఫ్ దక్కడంతో భారత అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తున్న రోహిత్ శర్మ సతీమణి రితికా కూడా హమ్మయ్య అనుకున్నారు. రితిక పక్కనే ఆర్ అశ్విన్ సతీమణి ప్రీతి, రవీంద్ర జడెజా సతీమణి రివా కూడా ఉన్నారు.
అయినా బంతులను ఎదుర్కోవడంలో పలుసార్లు రోహిత్ తడబడ్డాడు. చివరరకు 8వ ఓవర్ నాలుగో బంతికి రోహిత్ శర్మ(14) సోధి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కీలకమైన సమయంలో భారీ స్కోర్ సాధించలేక పెవిలియన్‌కు వెనుదిరగడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. కీలకమైన రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన రోహిత్ శర్మపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ మండిపడుతున్నారు.
Also Read..
శివారులో షాకింగ్ సీన్.. జూదశాలగా మారిన ఓ యువ హీరో ఫామ్‌హౌస్.. అతడు ఎవరంటే..?
Vice President of India: “కొందరు నాయకుల భాష వింటుంటే అసహ్యం కలుగుతుంది”