రాజస్థాన్ క్రికెట్ వర్గాలు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచి ఒకేసారి ముగ్గురు క్రికెటర్లు టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. ఇలా జరగడం ఇదే తొలిసారి. వెస్టిండీస్ పర్యటనకు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం ఆదివారం జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకే సారి టెస్టు, వన్డే, టీ20లకు ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఎడమచేతి వాటం పేసర్ ఖలీల్ అహ్మద్, అన్నదమ్ములు దీపక్ చాహర్ (పేసర్), రాహుల్ చాహర్ (స్పిన్నర్) టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం ఇప్పటికీ బీసీసీఐ నిషేధం ఎదుర్కొంటున్నా అక్కడి నుంచి ముగ్గురు భారత్‌కు ఆడుతుండటం విశేషమే.