జింబాబ్వేపై ఐసీసీ వేటు..తక్షణమే అమల్లోకి సస్పెన్షన్

|

Jul 19, 2019 | 11:52 AM

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే క్రికెట్‌లో అక్కడి ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా ఖండిచింది. తమ రాజ్యాంగాన్ని అతిక్రమించినందుకు జింబాబ్వే క్రికెట్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ…ఇక ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి అనుమతి లేదు. ప్రస్తుత క్రికెట్‌ బోర్డులోని సభ్యులను అక్క డి ప్రభుత్వ ఏజెన్సీ అయిన స్పోర్ట్స్‌ అండ్‌ రిక్రియేషన్‌ కమిటీ […]

జింబాబ్వేపై ఐసీసీ వేటు..తక్షణమే అమల్లోకి సస్పెన్షన్
Follow us on

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే క్రికెట్‌లో అక్కడి ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా ఖండిచింది. తమ రాజ్యాంగాన్ని అతిక్రమించినందుకు జింబాబ్వే క్రికెట్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ…ఇక ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి అనుమతి లేదు. ప్రస్తుత క్రికెట్‌ బోర్డులోని సభ్యులను అక్క డి ప్రభుత్వ ఏజెన్సీ అయిన స్పోర్ట్స్‌ అండ్‌ రిక్రియేషన్‌ కమిటీ తొలగించడమే ఐసీసీ నిర్ణయానికి కారణం. అందుకే ఆర్టికల్‌ 2.4 (సి) (డి) నిబంధనను అతిక్రమించినందుకు శాశ్వత సభ్యదేశమైన జింబాబ్వేపై వేటు వేయాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఐసీసీ నుంచి వచ్చే నిధులు కూడా పూర్తిగా ఆగిపోతాయి. అయితే మరో మూడు నెలల్లో జింబాబ్వే క్రికెట్‌ బోర్డు సభ్యులను తిరిగి నియమించాలని డెడ్‌లైన్‌ విధించింది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా క్రికెట్‌ కొనసాగాలని తాము కోరుకుంటున్నట్టు ఐసీసీ తెలిపింది.