
యూరో టీ20 స్లామ్ లీగ్‌కు సలహాదారుగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఒప్పందం కుదుర్చుకోవడంపై ఐసీసీ విస్మయం వ్యక్తంజేస్తోంది. ఐసీసీ సాంకేతిక కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లే తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఐసీసీ అంటోంది. యూరో స్లామ్ గురించి తమకెలాంటి సమాచారం లేదని బీసీసీఐ కూడా పేర్కొంది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో భారత క్రికెటర్లు పాల్గొనేలా బీసీసీఐ అనుమతిస్తే బాగుంటుందని కుంబ్లే వ్యాఖ్యానించడం విశేషం.