ఐసీసీ ప్రపంచ కప్‌ క్రికెట్‌కి భారీగా భారత్ అభిమానులు!

ఐసీసీ ప్రపంచ కప్‌ క్రికెట్‌ టోర్నిలో భారత జట్టు ఆడే మ్యాచుల్లో భారీసంఖ్యలో భారత అభిమానులతో ఇంగ్లాండ్‌ మైదానాలు నిండిపోనున్నాయి. ప్రపంచకప్‌లో జూన్‌ 5వ తేదీ నుంచి భారత్‌ జైత్రయాత్ర మొదలు కానుంది. దాదాపు నెలన్నరపాటు జరిగే ఈ క్రికెట్‌ సంబరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు, కార్పొరేట్‌ సంస్థలు ఛలో లండన్‌ అంటున్నాయి. ఈ సారి ఇంగ్లాండ్‌లో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు దాదాపు 80,000 మంది భారత అభిమానులు తరలివెళ్లనున్నట్లు సమాచారం. భారత్‌-ఇంగ్లాండ్‌ ట్రావెల్‌ ట్రెండ్స్‌, […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:47 pm, Wed, 8 May 19
ఐసీసీ ప్రపంచ కప్‌ క్రికెట్‌కి భారీగా భారత్ అభిమానులు!

ఐసీసీ ప్రపంచ కప్‌ క్రికెట్‌ టోర్నిలో భారత జట్టు ఆడే మ్యాచుల్లో భారీసంఖ్యలో భారత అభిమానులతో ఇంగ్లాండ్‌ మైదానాలు నిండిపోనున్నాయి. ప్రపంచకప్‌లో జూన్‌ 5వ తేదీ నుంచి భారత్‌ జైత్రయాత్ర మొదలు కానుంది. దాదాపు నెలన్నరపాటు జరిగే ఈ క్రికెట్‌ సంబరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు, కార్పొరేట్‌ సంస్థలు ఛలో లండన్‌ అంటున్నాయి. ఈ సారి ఇంగ్లాండ్‌లో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు దాదాపు 80,000 మంది భారత అభిమానులు తరలివెళ్లనున్నట్లు సమాచారం. భారత్‌-ఇంగ్లాండ్‌ ట్రావెల్‌ ట్రెండ్స్‌, భారత్‌లోని ట్రావెల్‌ ఏజెన్సీలు ఇచ్చిన గణాంకాల ఆధారంగా ఈ అంచనాలు వెలువడ్డాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి తరలివచ్చే అభిమానులు వీరికి అదనం. ప్రపంచ కప్‌కు తరలివచ్చే అభిమానుల్లో భారతీయులే అత్యధికంగా ఉంటారనేది ఖాయం అని ఢిల్లీలోని బ్రిటన్‌ హైకమిషన్‌ స్పష్టం చేసింది.