India vs England: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ సాధించిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా ప్లేయర్లు మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లోనూ తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే ఆ సిరీస్ కోసం సంసిద్ధమవుతున్నారు. మరోవైపు జట్టు సారధి కోహ్లీ సైతం ఇంగ్లండ్‌తో సిరీస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఇదిలాఉంటే, తాజాగా టీమిండియా సారథి విరాట్ కొహ్లీపై ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాలో మోస్ట్ డేంజర్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ అని, ఆతన్ని ఎలా అవుట్ చేయాలో అర్థం కావడం లేదని అన్నాడు. ఏ కోణంలో చూసినా కోహ్లీలో ఎలాంటి బలహీనతలు కనిపించడం లేదని, అతన్ని ఎలా అవుట్ చేయగలమో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించాడు. తనకు పాప పుట్టడంతో పాటు.. తాను లేకపోయినా టీమిండియా జట్టు అద్భుత ప్రదర్శనతో టెస్ట్ సరీస్‌ను కైవసం చేసుకోవడం కోహ్లీ నిండైన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని, అలాంటి కోహ్లీని ఎలా అవుట్ చేస్తామో? అంటూ మొయిన్ అనుమానం వ్యక్తం చేశాడు.
ఇదిలాఉంటే.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యత్తమ ఆటగాడని, అతడిని ఔట్ చేయడం అంత సులువుకాదని ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహమ్ థోర్‌పె రెండ్రోజుల క్రితం వ్యాఖ్యానించాడు. ప్రస్తతం టీం ఇండియా అత్యుత్తమ క్రికెట్ ఆడుతుందని, ఆస్ట్రేలియాని చిత్తుచేసి మరింత ఆత్మవిశ్వాసంతో ఉందన్నాడు. కోహ్లీ సేనలో బ్యాట్స్‌మెన్ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారని, ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేయడం అంత తేలిక కాదని పేర్కొన్నాడు.
Also read: