PV Sindhu: పెళ్ళైనా తగ్గని పీవీ సింధు ఫిట్నెస్.. సీక్రెట్ ఇదే..

|

Dec 23, 2024 | 6:15 PM

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు.. ఆటలో రాణించడానికి ఆమె ఫిట్‌నెస్ కూడా ఓ కారణం అని చెప్పవచ్చు. ఆమె ఫిట్‌నెస్ విషయంలో అస్సలు రాజీపడదట. ప్రతి రోజు ఉదయాన్నే కసరత్తులు చేస్తుందట. ముఖ్యంగా ఆమె కార్డియోని చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారట. అలాగే ఆమె డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటుందట.

PV Sindhu: పెళ్ళైనా తగ్గని పీవీ సింధు ఫిట్నెస్.. సీక్రెట్ ఇదే..
Pv Sindhu Fitness Secret
Follow us on

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఈ హైదరాబాద్ అమ్మాయికి బిర్యానీ, ఐస్‌క్రీమ్‌లు, షాపింగ్, పాప్ సంగీతం అంటే పిచ్చి.. ఈ 27 ఏళ్ల  బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ఎత్తు 5’10” (1.79 మీ) కాగా ఆమె ఎప్పుడు ఫిట్‌నెస్‌పైన ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటుంది.

సింధు ఒక్క రోజు కూడా ఏబ్స్ వర్కౌట్‌లను మిస్ చేయదు – క్రంచెస్, సైడ్ ప్లాంక్‌లు, వి-అప్‌లు తప్పకుండా చేస్తుంది. ఈ సందర్భంగా ఫిజియో ఇవాంజెలిన్ మాట్లాడుతూ..” ఇప్పటి వరకు ఓ  మహిళా అథ్లెట్ ఇంత కష్టపడడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె ఒక్క రోజు కూడా అబ్స్ మిస్ అవ్వలేదు” అని చెప్పుకొచ్చారు. “అలాగే సింధు మంచి వ్యక్తి అని ఆమె కాఫీ కోసం బయటకు వెళితే, ఆమె తన సిబ్బందికి కాఫీ కావాలా అని మామూలుగా అడుగుతుందని,  మా అందరీకి ఆమె కాఫీ తెస్తుందని” తెలిపింది.

సింధు తన ఫిట్‌నెస్ గూర్చి ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది. “నేను ఉదయం 7 గంటలకు నా మార్నింగ్ సెషన్‌ను ప్రారంభిస్తాను, అది మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటలకు లంచ్ కోసం ఇంటికి వెళ్లి 3 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటాను. శిక్షణ కోసం సాయంత్రం 4 గంటలకు అకాడమీకి తిరిగి వస్తాను. నా రోజును సాయంత్రం 7 గంటలకు ముగిస్తాను” అని పేర్కొంది.

సింధు వ్యాయామానికి ముందు స్ట్రెచెస్ చేస్తుంది. వర్కౌట్ సెషన్‌ను ప్రతిరోజూ మారుస్తూ ఉంటుంది. సింధు ఆహారంలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు బాగా సమతుల్యంగా ఉండేలా చూసుకుంటుంది. ఉదయం పూట అల్పాహారంగా పాలు, గుడ్లు, పండ్లు తీసుకుంటుంది. 12 సంవత్సరాలుగా తన తండ్రీతో కలిసి తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచేది. తండ్రి కుమార్తెను రోజుకు రెండుసార్లు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణకు తీసుకువెళ్లారు. సింధు తల్లి అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి కూడా..  సింధు ఒక ప్రత్యామ్నాయ రన్నింగ్ సెషన్‌ను అనుసరిస్తుంది. ఆమె ఒక రోజులో 100 పుష్-అప్‌లు, 200 సిట్-అప్‌లు చేస్తుంది. సింధు రోజువారీ షెడ్యూల్‌లో యోగా కూడా ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి