ధోనీ రిటైర్మెంట్‌పై సీఎస్​కే ట్వీట్!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పలుకుతున్నాడంటూ గురువారం వార్తలు షికారు చేశాయి. అయితే అవన్నీ రూమర్సే అని తర్వాత తేలిపోయింది. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్విట్టర్‌లో చేసిన పోస్టు వైరల్ అయింది. ప్రముఖ అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’​లో పాపులర్ డైలాగ్ ‘నాట్ టుడే’ పేరుతో పోస్ట్ చేసింది సీఎస్​కే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఏడాది విడుదలైన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ […]

ధోనీ రిటైర్మెంట్‌పై సీఎస్​కే ట్వీట్!

Updated on: Sep 14, 2019 | 4:58 AM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పలుకుతున్నాడంటూ గురువారం వార్తలు షికారు చేశాయి. అయితే అవన్నీ రూమర్సే అని తర్వాత తేలిపోయింది. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్విట్టర్‌లో చేసిన పోస్టు వైరల్ అయింది. ప్రముఖ అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’​లో పాపులర్ డైలాగ్ ‘నాట్ టుడే’ పేరుతో పోస్ట్ చేసింది సీఎస్​కే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఏడాది విడుదలైన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ చివరి సీజన్​లో ఆర్య స్టార్క్ చెప్పిన ‘నాట్ టుడే’ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అదే రీతిలో ధోనీ జెర్సీ 7ను ‘నాట్ టుడే’ పదంలోని ఆంగ్ల అక్షరం టీ స్థానంలో ఉంచి పోస్టు పెట్టింది సీఎస్​కే.

మరోవైపు ధోనీ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ స్పందించిన విషయం తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్‌కి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ‘ధోనీ రిటైర్మెంట్‌కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఆ వార్తలు అవాస్తవం.’ అని ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాకు తెలిపారు. వరల్డ్ కప్ ‌ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత రెండు నెలల పాటు విశ్రాంతి కావాలని ధోనీ కోరాడు. ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ అయిన ధోనీ పారామిలటరీ ట్రైనింగ్ కోసం వెళ్లాడు. జమ్మూకాశ్మీర్‌లో కూడా కొన్ని రోజులు విధులు నిర్వర్తించాడు. వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా టూర్లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, అందులో ధోనీకి చోటు దక్కలేదు.
వరల్డ్ కప్ నుంచి ధోనీ రిటైర్మెంట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, మిస్టర్ కూల్ మాత్రం ఎక్కడా ప్రకటన చేయలేదు.