IPL 2021: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సురేష్ రైనా రీ-ఎంట్రీ.. చెన్నై యాజమాన్యం స్పష్టత..

|

Jan 20, 2021 | 8:13 PM

IPL 2021: ఐపీఎల్ 14కు సంబంధించిన మినీ వేలం జరగబోయే ముందే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు శుభవార్త అందింది. ఐపీఎల్ 2021కి ...

IPL 2021: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సురేష్ రైనా రీ-ఎంట్రీ.. చెన్నై యాజమాన్యం స్పష్టత..
Follow us on

IPL 2021: ఐపీఎల్ 14కు సంబంధించిన మినీ వేలం జరగబోయే ముందే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు శుభవార్త అందింది. ఐపీఎల్ 2021కి చిన్న తలా సురేష్ రైనా తమతోనే కొనసాగుతాడని సీఎస్‌కే యాజమాన్యం స్పష్టం చేసింది. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన వెంటనే రైనాతో మాట్లాడామని.. మినీ వేలంలో పాల్గొంటాడని తెలిపింది. ఖచ్చితంగా ఈ సీజన్ ఐపీఎల్‌కు తమ జట్టుతోనే కొనసాగుతాడని స్పష్టం చేసింది. కేదార్ జాదవ్, పియూష్ చావ్లా, హర్భజన్, విజయ్‌లు తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్సులు తక్కువగా ఉన్నాయని చెన్నై యాజమాన్యం పేర్కొంది. అటు విదేశీ ఆటగాళ్లు బ్రావో, డుప్లెసిస్‌ కూడా సీఎస్‌కేతోనే కొనసాగనున్నారు.