Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డొ ఇంట తీవ్ర విషాదం.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటామంటూ ఎమోషనల్ పోస్ట్..

ప్రముఖ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రొనాల్డో- జార్జినా రోడ్రిగ్జ్‌ జంటకు జన్మించిన కవల పిల్లల్లో ఒకరు మృతి చెందారు.

Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డొ ఇంట తీవ్ర విషాదం.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటామంటూ ఎమోషనల్ పోస్ట్..
Cristiano Ronaldo
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 19, 2022 | 8:57 AM

ప్రముఖ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రొనాల్డో- జార్జినా రోడ్రిగ్జ్‌ జంటకు జన్మించిన కవల పిల్లల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రొనాల్డో సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. ‘అప్పుడే పుట్టిన మా బాబు చనిపోయిన విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏ తల్లిదండ్రులకైనా ఇది భరించలేని విషాదం. మా పాప జీవించి ఉన్న విషయం ఒక్కటే ఇప్పుడు మాకు కొండంత ఆశ, ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆపత్కాల సమయంలో మా వెన్నంటి ఉన్న డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఎవరూ మా వ్యక్తిగత గోపత్యకు భంగం కల్పించవద్దని కోరుతున్నాం. బాబూ.. నువ్వు మా ఏంజెల్‌వి. మాకు దూరమైనా నిత్యం మా గుండెల్లోనే ఉంటావు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’ అని రొనాల్డో దంపతులు ఎమోషనల్‌ అయ్యారు. అయితే ఏ కారణంతో పిల్లాడు చనిపోయాడో రొనాల్డొ దంపతులు చెప్పలేదు. కాగా ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు అతనికి మనోధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా రొనాల్డో- జార్జినా జంటకు నలుగురు పిల్లలున్నారు. తాము మరోసారి అమ్మానాన్నలం కాబోతున్నట్లు గత అక్టోబర్‌లో ఈ దంపతులు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు 1131 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో.. 800కు పైగా గోల్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఆటపరంగానే కాకుండా తన ప్రవర్తనతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడీ సాకర్‌ దిగ్గజం. ఫుట్‌బాల్‌ టోర్నీలతో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ ఏ మాత్రం సమయం దొరికినా తన కుటుంబానికి కేటాయిస్తుంటాడు రొనాల్డొ. తన కుటుంబమే తనకు బలమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

Also Read: RR vs KKR, IPL 2022: చాహల్‌ ‘పాంచ్‌’ పటాకా.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్‌ గెలుపు..

Vijay Devarakonda- Samantha : సమంత -విజయ్ దేవరకొండ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. అదేంటంటే

New Army Chief: ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే.. తొలిసారి ఇంజినీర్‌కు భారత సైన్యం బాధ్యతలు..

Latest Articles