ZIM vs IND: 2వ టీ20కి సిద్ధమైన జింబాబ్వే, భారత జట్లు.. ఒత్తడిలో భారత యువసేన

|

Jul 07, 2024 | 11:42 AM

Zimbabwe Vs India, 2nd T20I: హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధించింది . ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 115 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో 2వ మ్యాచ్‌కి ఇరు జట్లు సిద్ధమయ్యాయి.

ZIM vs IND: 2వ టీ20కి సిద్ధమైన జింబాబ్వే, భారత జట్లు.. ఒత్తడిలో భారత యువసేన
Ind Vs Zim 5th T20i
Follow us on

Zimbabwe Vs India, 2nd T20I: హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధించింది . ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 115 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో 2వ మ్యాచ్‌కి ఇరు జట్లు సిద్ధమయ్యాయి.

ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌ కూడా హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ మైదానంలోనే జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసేందుకు టీమిండియా ఎదురుచూస్తోంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన జింబాబ్వే సిరీస్‌లో ఆధిక్యాన్ని నిలబెట్టుకునే స్థితిలో ఉంది. దీంతో నేటి మ్యాచ్‌లోనూ ఇరు జట్ల నుంచి హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశం ఉంది.

ఏ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం?

ఇండియా vs జింబాబ్వే సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లో చూడవచ్చు. అలాగే, సోనీ లైవ్ యాప్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.

భారత టీ20 జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మెద్ , ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే, హర్షిత్ రాణా. (శివమ్ దూబే, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ – మిగిలిన మూడు మ్యాచ్‌లకు).

జింబాబ్వే జట్టు: బ్రియాన్ బెన్నెట్, తాడివానాషే మారుమణి, సికందర్ రజా (కెప్టెన్), జొనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), ఇన్నోసెంట్ కైయా, వెస్లీ మాధేవేర్, ల్యూక్ జోంగ్వే, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజ్రబానీ, మయరాండ్రాన్, బ్రాండ్రాన్ న్గారాండా , ఫరాజ్ అక్రమ్, అంతుమ్ నఖ్వీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..