7 ఓవర్లలో 9 వికెట్లు.. ఇచ్చింది కేవలం 11 పరుగులు.. ఈ బౌలర్ ప్రతిభకు ఫిదా అవుతోన్న క్రికెట్ ప్రేమికులు!

|

Sep 13, 2021 | 1:34 PM

ఈ బౌలర్ 42 బంతులు సంధించింది. కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చింది. టీ 20 క్రికెట్‌లో ఇటువంటి ప్రదర్శన ఎంతో ఖరీదైనదిగా నమోదైంది.

7 ఓవర్లలో 9 వికెట్లు.. ఇచ్చింది కేవలం 11 పరుగులు.. ఈ బౌలర్ ప్రతిభకు ఫిదా అవుతోన్న క్రికెట్ ప్రేమికులు!
Zimbabwe Cricketer Esther Mbofana
Follow us on

Esther Mbofana: టీ 20 క్రికెట్‌ అంటేనే బ్యాట్స్‌మెన్ గేమ్ అని పిలిస్తుంటారు. అయితే ఇందులో బౌలర్లు కూడా అప్పుడప్పుడూ అద్భుతంగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి ఓ గేమ్‌లో జింబాబ్వే క్రికెటర్ భయాందోళనలు సృష్టించింది. ఇప్పటివరకు రెండు టీ 20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ మహిళా క్రికెటర్ వరుసగా వికెట్లు తీస్తూ బ్యాట్స్‌మెన్లను భయపెట్టింది. ఈ బౌలర్‌ను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌లకు కష్టంగా మారుతోంది. ఈ బౌలర్ పేరు ఎస్తేర్ మోఫ్నా. ఈ 28 ఏళ్ల మహిళా క్రికెటర్ ఈ నెలలో అంతర్జాతీయ మహిళా టీ 20 క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఆమె తొమ్మిది వికెట్లు తీసింది. ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఎస్తేర్ మోఫ్నా అద్భుత ప్రదర్శన కనబరిచింది.

ఎంబోఫ్నా సెప్టెంబర్ 11 న ఈశ్వతిని మహిళల జట్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. మొదటి మ్యాచ్‌లోనే ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లు ఔట్ చేసింది. జింబాబ్వే బౌలింగ్ ప్రారంభించిన వెంటనే ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లను 11 పరుగులకే ఔట్ చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్ర మ్యాచ్‌లో వికెట్లు తీయడంలో మహిళా క్రికెట్‌లో ఇది అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆమె నేపాల్‌కు చెందిన అంజలి చంద్‌ని, బోట్స్వానాకు చెందిన బొత్సోగో మ్పెడీని పెవిలియన్ చేరింది. ఎస్తేర్ మొఫ్ఫానా బాధితులుగా మారిన ఆరుగురు బ్యాట్స్ మెన్లలో నలుగురు ఖాతా కూడా తెరవలేకపోయారు. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చింది. అందులో కూడా వైడ్ నుంచి ఐదు పరుగులు వచ్చాయి.

అగ్రస్థానంలో జింబాబ్వే జట్టు
ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు 17 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు కేవలం 12 బంతుల్లో లక్ష్యాన్ని సాధించింది. దీంతో ఈ మ్యాచులో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే రెండవ మ్యాచ్‌ను బోట్స్వానా మహిళల జట్టుతో ఆడింది. ఇందులో ఆమె మూడు ఓవర్లలో ఆరు పరుగులకే ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపింది. ఈ విధంగా, అతని కెరీర్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో, మొఫ్ఫానా పేరుతో ఏడు ఓవర్లలో 17 పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు తీసి రాకార్డులు నెలకొల్పింది.

మహిళల టీ 20 ప్రపంచకప్‌లో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల గురించి మాట్లాడితే, జింబాబ్వే జట్టు మూడు మ్యాచుల్లో మూడు గెలిచి ముందంజలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

Also Read: CPL 2021: విండీస్‌లో ముంబై ప్లేయర్ ప్రతాపం.. 232 స్ట్రైక్‌తో బౌలర్లకు చుక్కలు.. 22 బంతుల్లోనే ఫలితం రాబట్టిన ప్లేయర్ ఎవరంటే?

Viral Video: స్టేడియం పైకప్పు నుంచి కింద పడబోయిన పిల్లి.. ప్రేక్షకుల సమయస్ఫూర్తితో ఎలా ఆదుకున్నారో తెలుసా? వైరలవుతోన్న వీడియో

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీలో మార్పు.. తప్పుకోనున్న విరాట్ కోహ్లీ.. పరిమిత ఓవర్లలో ఇక అతనిదే సారథ్యం..?