Lord’s Test : జైక్ క్రాలీ వికెట్ తీసి సింహంలా గర్జించిన నితీష్ కుమార్ రెడ్డి.. నాలుగో రోజు మ్యాచ్‌లో ఉద్రిక్తత

లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజున నితీశ్ కుమార్ రెడ్డి, జైక్ క్రాలీ వికెట్ తీసి అతన్ని రెచ్చగొట్టాడు. క్రికెట్‌లో వికెట్ పడినప్పుడు ఆటగాళ్లు తమ భావోద్వేగాలను వ్యక్తం చేయడం సహజం. అయితే, ప్రత్యర్థి ఆటగాడిని రెచ్చగొట్టడం స్టేడియంలో అనవసరమైన ఉద్రిక్తతలకు దారితీస్తుంది.

Lords Test : జైక్ క్రాలీ వికెట్ తీసి సింహంలా గర్జించిన నితీష్ కుమార్ రెడ్డి.. నాలుగో రోజు మ్యాచ్‌లో ఉద్రిక్తత
Nitish Kumar Reddy

Updated on: Jul 13, 2025 | 7:49 PM

Lord’s Test : భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో మొహమ్మద్ సిరాజ్ బాటలో నితీశ్ కుమార్ రెడ్డి నడిచాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ జైక్ క్రాలీ వికెట్ తీసిన తర్వాత అతనిని రెచ్చగొడుతూ గట్టిగా అరిచాడు. యశస్వి జైస్వాల్ క్యాచ్ పట్టిన తర్వాత, నితీష్ కుమార్ రెడ్డి క్రాలీ వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. ఆ తర్వాత తన సహచర ఆటగాళ్లతో కలిసి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వికెట్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో పడింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నితిష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ ఇచ్చాడు. నితీష్ వేసిన బంతిని క్రాలీ ఆడడానికి ప్రయత్నించాడు. కానీ, అది లూజ్ షాట్ కావడంతో బంతి స్లిప్‎లో ఉన్న యశస్వి జైస్వాల్ చేతిలో పడింది.

నితీశ్ కుమార్ రెడ్డి మొదటి ఇన్నింగ్స్‌లో కూడా జైక్ క్రాలీ వికెట్‌ను తీశాడు. అప్పుడు బంతి అనూహ్యంగా బౌన్స్ అవ్వడంతో క్రాలీ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. నితీశ్ కుమార్ రెడ్డి క్రాలీని అవుట్ చేయడానికి ముందు, సిరాజ్ ఓలీ పోప్, బెన్ డకెట్‌ను తక్కువ పరుగులకే అవుట్ చేశాడు. లంచ్‌కు కొన్ని ఓవర్ల ముందు, ఆకాష్ దీప్ హ్యారీ బ్రూక్ వికెట్‌ను తీశాడు.

నాలుగో రోజు ఆట చివరి ఓవర్‌లో, జైక్ క్రాలీ, శుభ్‌మన్ గిల్ మధ్య తీవ్రమైన వాదన జరిగింది. క్రాలీ టైం వేస్ట్ చేస్తున్నాడని శుభ్‌మన్ గిల్ ఆరోపించాడు.లంచ్ సమయానికి ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 98 పరుగుల ఆధిక్యంలో ఉంది. జో రూట్, బెన్ స్టోక్స్ ఇంకా క్రీజ్‌లో ఉన్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..