‘ఆండర్సన్ కంటే జహీర్ బెస్ట్ బౌలర్’.. టీమిండియా దిగ్గజంపై ఇషాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇంకా ఏమన్నాడంటే..?

Ishant Sharma: టీమిండియా మాజీ బౌలర్‌పై జహీర్ ఖాన్‌పై వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తరఫున ఆస్ట్రేలియాతో యాషెస్ ఆడుతున్న జేమ్స్ ఆండర్సన్ కంటే జహీర్ బెస్ట్ అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు. ఇటీవల రణ్‌వీర్ అల్లాబాడియా యూట్యూబ్ షోలో..

‘ఆండర్సన్  కంటే జహీర్ బెస్ట్ బౌలర్’.. టీమిండియా దిగ్గజంపై ఇషాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇంకా ఏమన్నాడంటే..?
Zaheer And Anderson

Updated on: Jun 26, 2023 | 4:30 PM

Ishant Sharma: టీమిండియా మాజీ బౌలర్‌పై జహీర్ ఖాన్‌పై వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తరఫున ఆస్ట్రేలియాతో యాషెస్ ఆడుతున్న జేమ్స్ ఆండర్సన్ కంటే జహీర్ బెస్ట్ అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు. ఇటీవల రణ్‌వీర్ అల్లాబాడియా యూట్యూబ్ షోలో మాట్లాడిన ఇషాంత్.. ‘అండర్సన్ బౌలింగ్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది, అతను ఇంగ్లాండ్ పిచ్‌ల పైనే మెరుగ్గా ప్రభావం చూపగలడు. భారత్‌లో అతను ఆడి ఉంటే ప్రభావం చూపలేకపోవచ్చు. నా వరకు అతని కంటే జహీర్ మెరుగైన బౌలర్’ అని అన్నాడు.

అలాగే భారత్‌కి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ బాధ్యతలు తీసుకున్న వెంటనే.. జట్టులోకి ఫిట్‌నెస్ సంస్కృతిని తీసుకొచ్చాడని, అదే ఇప్పుడు టీమ్‌లో తప్పనిసరి అయిందని ఇషాంత్ తెలిపాడు. ఇదిలా ఉండగా.. యువ ప్లేయర్లు రాణించడంతో ఇషాంత్ వంటి సీనియర్లకు టీమిండియాలో స్థానం లభించడంలేదు. ఇషాంత్ ఇప్పటివరకు భారత్ తరఫున 105 టెస్టులు ఆడి 311 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో ఇషాంత్ పేరిట 11 సార్లు 5 వికెట్ హాల్, ఓ సారి 10 వికెట్ల హాల్ ఉంది. అలాగే ఇప్పటివరకు 80 వన్డేలు ఆడిన ఇషాంత్ 115 వికెట్లు పడగొట్టాడు. అయితే 14 టీ20 మాత్రమే ఆడిన అతను అందులో 8 వికెట్లే తీసుకున్నాడు.

మరోవైపు వచ్చే నెల 12 నుంచి భారత్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. తన పర్యటనలో భాగంగా విండీస్‌తో టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us