Zaheer Khan – Sagarika Ghatge: 46 ఏళ్ల వయసులో తండ్రైన టీమిండియా క్రికెటర్.. బిడ్డ పేరు ఏంటంటే?

Zaheer Khan - Sagarika Ghatge: బాలీవుడ్ నటి సాగరిక ఘట్గే, భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ దంపతులు తల్లిదండ్రులుగా మారారు. కుమారుడు పుట్టిన వార్తను ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తమ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. 46 ఏళ్ల వయసులో జహీర్ తండ్రయ్యాడు.

Zaheer Khan - Sagarika Ghatge: 46 ఏళ్ల వయసులో తండ్రైన టీమిండియా క్రికెటర్.. బిడ్డ పేరు ఏంటంటే?
Zaheer Khan Sagarika Ghatge

Updated on: Apr 16, 2025 | 12:45 PM

Zaheer Khan-Sagarika Ghatge: నటి సాగరిక ఘట్గే, భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ అభిమానులకు శుభవార్త వచ్చింది. జహీర్, సాగరిక తల్లిదండ్రులు అయ్యారు. వీరి ఇంటికి ఒక చిన్న అతిథి వచ్చేసింది. ఈ శుభవార్తను ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అందరితో పంచుకున్నారు. జహీర్, సాగరిక దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ప్రత్యేక ఫొటోను పోస్ట్ చేయడం ద్వారా ఆ బిడ్డ పేరును ప్రకటించారు.

‘మేం మా కుమారుడు ఫతే సింగ్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాం’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో పాటు ఈ క్యాప్షన్‌తో పోస్ట్ షేర్ చేశారు. ఒక పోస్ట్‌లో సాగరిక-జహీర్ ఉండగా, రెండవ ఫొటోలో ఆ చిన్నారి వేలు పట్టుకుని ఉన్న ఫొటో ఉంది. దీంతో ఈ పోస్ట్‌కు లైక్‌లు వెల్లువెత్తుతున్నాయి.

చక్ దే ఇండియాతో సహా అనేక చిత్రాలలో నటించిన సాగరిక ఘట్గే, భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. నవంబర్ 23, 2017న నిశ్చితార్థం చేసుకున్నారు. అంతకు ముందు వారు చాలా కాలంగా ఒకరితో ఒకరు డేటింగ్‌లో ఉన్నారు.

ఐపీఎల్ 2025లో బిజీగా జహీర్ ఖాన్..

జహీర్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్ లో అతను లక్నో సూపర్ జెయింట్స్ కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. లక్నో ఇప్పటివరకు ఐపీఎల్‌లో 7 మ్యాచ్‌లు ఆడి, 4 గెలిచి, 3 ఓడిపోయింది. జహీర్ ఖాన్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. IPL 2025లో తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 19 న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. కానీ, జైపూర్‌లో జరిగే ఆ మ్యాచ్‌కు ముందు, జహీర్ ఖాన్ తన భార్య, నవజాత శిశువుతో కొంత సమయం గడిపే అవకాశం ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..