
Yuzvendra Chahal : భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో, సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటాడు. గురువారం రాత్రి జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో చాహల్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. తన పంజాబ్ కింగ్స్ జట్టు సభ్యులు రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి చాట్ చేస్తున్నప్పుడు తన మాజీ భార్య ధనశ్రీ వర్మ గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. విడాకులు, భరణం చెల్లింపుల నేపథ్యంలో చాహల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గురువారం రాత్రి యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వారి ముగ్గురి మధ్య పెళ్లిళ్ల గురించి చర్చ జరిగింది. రవి బిష్ణోయ్ ఇటీవల కొంతమంది స్నేహితుల పెళ్లిళ్లకు హాజరైనట్లు చెప్పగా, చాహల్ వెంటనే అర్ష్‌దీప్ సింగ్‌ను త్వరగా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.
దీనిపై అర్ష్‌దీప్ ప్రశ్నించగా చాహల్ చమత్కారంగా బదులిస్తూ.. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉన్నట్లుంది అని అన్నాడు. ఈ వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాహల్ చేసిన ఈ బ్యాంక్ బ్యాలెన్స్ వ్యాఖ్యలు అతని వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యాన్ని సూచిస్తున్నాయి. చాహల్ 2020లో యూట్యూబర్ ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్నాడు. అయితే 2022లో ఈ జంట విడిపోయి, ఈ సంవత్సరం ప్రారంభంలో వారి విడాకులు ఖరారయ్యాయి.
నివేదికల ప్రకారం.. చాహల్ తన మాజీ భార్యకు భరణం కింద రూ.4.75 కోట్లకు పైగా చెల్లించినట్లు సమాచారం. విడాకుల ప్రక్రియ చివరి విచారణ సందర్భంగా కూడా చాహల్ పరోక్షంగా వార్తల్లో నిలిచాడు. ఆ రోజు చాహల్ బీ యువర్ ఓన్ షుగర్ డాడీ అని రాసి ఉన్న టీ-షర్ట్‌ను ధరించి కోర్టుకు హాజరయ్యాడు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చేసిన బ్యాంక్ బ్యాలెన్స్ వ్యాఖ్యలు చాహల్ మాజీ భార్యపై మళ్లీ సెటైర్ వేశాడనే చర్చకు దారితీస్తున్నాయి.
#YuzvendraChahal visited the court wearing a tshirt: Be your own Sugar Daddy 😂😂
This is the most savage alimony hearing move I have ever seen 😂😂#dhanashreeverma pic.twitter.com/pqO15CjtXY
— Bollywood Talkies (@bolly_talkies) March 20, 2025
ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ ఇద్దరూ పంజాబ్ కింగ్స్ జట్టులో సహచరులు. ఈ ఫ్రాంఛైజీ వీరిద్దరిపై చెరో రూ.18 కోట్లకు పైగా ఖర్చు చేసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చాహల్ రికార్డును అర్ష్‌దీప్ సింగ్ ఇటీవలే అధిగమించాడు. అయితే ఐపీఎల్ చరిత్రలో 200+ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా చాహల్ ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..