AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video : ఛీ..ఛీ.. చాహల్ ఇక నువ్వు మారవా.. విమానంలో కూడా ఏంటా పనులు ?

Watch Video : టీమిండియా స్టార్ స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు యుజ్వేంద్ర చహల్ వంతు వచ్చింది. విమాన ప్రయాణంలో చహల్ ఈ-సిగరెట్ తాగుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ఒక వ్యక్తి ఆ వీడియో నుంచి స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Watch Video : ఛీ..ఛీ.. చాహల్ ఇక నువ్వు మారవా.. విమానంలో కూడా ఏంటా పనులు ?
Yuzvendra Chahal
Rakesh
|

Updated on: May 07, 2026 | 4:38 PM

Share

Watch Video : ఐపీఎల్ 2026 సీజన్‌లో వివాదాలు ఆటగాళ్లను నీడలా వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (ఈ-సిగరెట్) చేస్తూ దొరికిపోగా, ఇప్పుడు టీమిండియా స్టార్ స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు యుజ్వేంద్ర చహల్ వంతు వచ్చింది. విమాన ప్రయాణంలో చహల్ ఈ-సిగరెట్ తాగుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. దీంతో క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన యూట్యూబ్ ఛానెల్ కోసం ఒక వ్లాగ్ (వీడియో) షూట్ చేశాడు. అందులో చహల్ పక్కన శశాంక్ సింగ్ కూర్చుని ఉండగా, చహల్ చేతిలో ఈ-సిగరెట్ లాంటి వస్తువు ఉన్నట్లు నెటిజన్లు గుర్తించారు. ఒక వ్యక్తి ఆ వీడియో నుంచి స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఎడిటింగ్ అనుమానాలు – సాక్ష్యాలు ఉన్నాయా?

ఈ వివాదం ముదిరిన తర్వాత అర్ష్‌దీప్ తన ఛానెల్‌లో ఆ వీడియోను ఎడిట్ చేసినట్లు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మొదట 16 నిమిషాల 56 సెకన్ల నిడివి ఉన్న వీడియో, ఇప్పుడు కేవలం 16 నిమిషాలకే పరిమితమైంది. చహల్ ఉన్న భాగాన్ని కావాలనే తొలగించారని కొందరు వాదిస్తున్నారు. అయితే ఈ వీడియోపై పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గానీ, చహల్ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. విమాన ప్రయాణంలో స్మోకింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో చహల్‌పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఏప్రిల్ నెలలో కూడా..

ఏప్రిల్ నెలలో తన పోర్షే కారును డ్రైవింగ్ చేస్తూ చాహల్ సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కేవలం సిగరెట్ తాగడమే కాకుండా.. కాలుతున్న సిగరెట్ ముక్కను నిర్లక్ష్యంగా రోడ్డుపైకి విసిరివేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సెలబ్రిటీ అయి ఉండి కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు.

రియాన్ పరాగ్‌పై వేటు.. మరి చహల్ సంగతేంటి?

కొద్ది రోజుల క్రితమే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కెమెరాకు దొరికిపోయాడు. దీనిపై సీరియస్ అయిన బీసీసీఐ, అతడికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఇప్పుడు చహల్ వ్యవహారం కూడా నిరూపితమైతే అతడిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. క్రీడాకారులు యువతకు రోల్ మోడల్స్‌గా ఉండాలని, ఇలాంటి పనులు చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
కూర్చుని మరీ కొట్టాడు.. వింత షాట్‌తో అదరగొట్టిన వాషింగ్టన్
కూర్చుని మరీ కొట్టాడు.. వింత షాట్‌తో అదరగొట్టిన వాషింగ్టన్
పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు - RBI గవర్నర్ కీలక వ్యాఖ్యలు
పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు - RBI గవర్నర్ కీలక వ్యాఖ్యలు
మామిడి ఆకులు శుభప్రదమే కానీ ఇంటి ముందు చెట్టు ఉంటే ఏమవుతుంది?
మామిడి ఆకులు శుభప్రదమే కానీ ఇంటి ముందు చెట్టు ఉంటే ఏమవుతుంది?
పంటలకు ప్రకృతి కవచం: హైదరాబాద్ శాస్త్రవేత్తల అరుదైన ఆవిష్కరణ
పంటలకు ప్రకృతి కవచం: హైదరాబాద్ శాస్త్రవేత్తల అరుదైన ఆవిష్కరణ
చుట్టూ జనం ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? ఇదే అసలు కారణం
చుట్టూ జనం ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? ఇదే అసలు కారణం
త్రిష సినిమాకు బంపర్ ఆఫర్..
త్రిష సినిమాకు బంపర్ ఆఫర్..
ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
బీహార్‌ సాల్వర్‌ గ్యాంగ్ 'నీట్‌' కుట్ర.. పరీక్షలపై మాఫియా నీడలు
బీహార్‌ సాల్వర్‌ గ్యాంగ్ 'నీట్‌' కుట్ర.. పరీక్షలపై మాఫియా నీడలు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
ఓర్నీ.. పెద్ద కథేగా.. మన దేశంలో రోజుకు ఎంత బంగారం కొంటారో తెలుసా
ఓర్నీ.. పెద్ద కథేగా.. మన దేశంలో రోజుకు ఎంత బంగారం కొంటారో తెలుసా