Yuvraj Singh: బూట్లు ఇచ్చుకుని కొడతా.. అభిషేక్, గిల్‌పై యువరాజ్ సింగ్‌ ఫైర్.. ఎందుకంటే?

Abhishek Sharma, Shubman Gill in Australia: భారత జట్టు ప్రస్తుతం టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఉంది. గోల్డ్ కోస్ట్‌లో నాల్గవ టీ20ఐకి ముందు, అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్ కొంత సరదాగా గడిపారు. దీంతో యువరాజ్ సింగ్ ఫైర్ అయ్యాడు.

Yuvraj Singh: బూట్లు ఇచ్చుకుని కొడతా.. అభిషేక్, గిల్‌పై యువరాజ్ సింగ్‌ ఫైర్.. ఎందుకంటే?
Ind Vs Aus 4th T20i

Updated on: Nov 05, 2025 | 1:03 PM

Abhishek Sharma, Shubman Gill in Australia: అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్ భారత క్రికెట్ భవిష్యత్తుగా మారిపోయారు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు చాలా సారూప్యతలు ఉన్నాయి. ఒకటి వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు కాగా, దాదాపు 13-14 సంవత్సరాల వయస్సు నుంచే కలిసి క్రికెట్ ఆడుతున్నారు. స్నేహితులుగా ఉండటమే కాదు, ఇద్దరు ఒకే గురువు దగ్గర చిట్కాలు నేర్చుకున్నారు. వీరి గురువు యువరాజ్ సింగ్. అయితే, తాజాగా వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తన ఇద్దరు శిష్యుల ఫొటోలను చూసిన యువరాజ్ సింగ్ కోపంగా ఉన్నాడు.

గోల్డ్ కోస్ట్‌లో సముద్రంలో ఎంజాయ్..

భారత జట్టు ప్రస్తుతం టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. నాల్గవ టీ20 నవంబర్ 6న గోల్డ్ కోస్ట్‌లో జరగనుంది. కానీ దానికి ముందు, అభిషేక్, శుభ్‌మాన్ సముద్రాన్ని ఆస్వాదించడానికి గోల్డ్ కోస్ట్‌కు వెళ్లారు. వారు బీచ్‌లో సరదాగా గడపడమే కాకుండా సముద్రంలోకి చొక్కా లేకుండా కూడా వెళ్లారు.

ఇవి కూడా చదవండి

అభిషేక్, గిల్‌లపై యువరాజ్ ఫైర్..

అభిషేక్ శర్మ శుభ్‌మాన్ గిల్‌తో బీచ్‌లో సరదాగా గడిపిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు, యువరాజ్ సింగ్ కోపంగా ఉన్నాడు. అభిషేక్ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, అతను పంజాబీలో “జుటి లావన్ దోనా దే” అని రాసుకొచ్చాడు. అంటే, “నేను మీ ఇద్దరినీ నా బూట్లతో కొడతాను” అంటూ ఫైర్ అయ్యాడు.

యువరాజ్ సింగ్ విమర్శలు..

యువరాజ్ సింగ్ తన శిష్యులను సరదాగా షూలతో కొడతానంటూ కామెంట్ చేశాడు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ జట్టులో స్టార్ బ్యాటర్స్. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించే బాధ్యత వారిపై ఉంది. సిరీస్‌లోని మొదటి మూడు టీ20లలో, అభిషేక్ శర్మ ఒక మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ అంతగా రాణించలేదు.

యువరాజ్ తన శిష్యుల నుంచి ఏం కోరుకుంటున్నాడు?

టీ20 సిరీస్ గెలవాలంటే భారత్ చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు కూడా ఇదే లక్ష్యం అవుతుంది. ఒక గురువుగా, యువరాజ్ సింగ్ కూడా తన శిష్యుడు సరదాగా గడపాలని కోరుకుంటాడు. కానీ అతను గతంలో ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిచినట్లుగానే, భారత జట్టు తరపున సిరీస్ విజయంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..