Deeya Yadav : వైభవ్‌ సూర్యవంశి రికార్డుకు దీటుగా వేలంలో చరిత్ర సృష్టించిన హర్యానా ఓపెనర్

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా ఆక్షన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక ప్రత్యేకమైన క్రీడాకారిణిపై పెట్టుబడి పెట్టింది. ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఆమె పేరు దియా యాదవ్. చిన్న వయసులోనే వేలంలో ఎంపికై డబ్ల్యూపీఎల్ చరిత్రలో అతి తక్కువ వయసున్న క్రీడాకారిణిగా దియా యాదవ్ రికార్డు సృష్టించింది.

Deeya Yadav : వైభవ్‌ సూర్యవంశి రికార్డుకు దీటుగా వేలంలో చరిత్ర సృష్టించిన హర్యానా ఓపెనర్
Deeya Yadav

Updated on: Nov 28, 2025 | 10:28 AM

WPL 2026 Auction : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా ఆక్షన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక ప్రత్యేకమైన క్రీడాకారిణిపై పెట్టుబడి పెట్టింది. ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఆమె పేరు దియా యాదవ్. చిన్న వయసులోనే వేలంలో ఎంపికై డబ్ల్యూపీఎల్ చరిత్రలో అతి తక్కువ వయసున్న క్రీడాకారిణిగా దియా యాదవ్ రికార్డు సృష్టించింది. హర్యానాకు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌వుమన్, తన దూకుడు బ్యాటింగ్‌తో పెద్ద పెద్ద బౌలర్లను సైతం కంగారు పెడుతుంది.

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసిన క్రీడాకారిణి దియా యాదవ్. ఈ యువ ప్లేయర్ వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఐపీఎల్‌లో 13 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించినట్లుగా, ఇప్పుడు దియా యాదవ్ 16 ఏళ్లకే డబ్ల్యూపీఎల్ లోకి అడుగుపెట్టి లీగ్‌లో అత్యంత తక్కువ వయసున్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఈమె హర్యానాకు చెందిన ఓపెనింగ్ బ్యాట్స్‌వుమన్.

దియా యాదవ్ హర్యానా తరపున ఓపెనింగ్ బ్యాటింగ్‌ చేస్తుంది. వయసు చిన్నదైనా తన దూకుడు, పవర్ హిట్టింగ్ సామర్థ్యంతో బౌలర్లను ఇబ్బంది పెట్టడంలో దియాకు మంచి పేరుంది. ఈమె కేవలం 14 ఏళ్ల వయసులోనే సెంచరీ చేసి వార్తల్లో నిలిచింది. వీమెన్స్ అండర్ 15 వన్డే కప్ ట్రోఫీలో ఢిల్లీ జట్టుపై ఏకంగా నాటౌట్ 124 పరుగులు చేసి తన సత్తా ఏంటో చూపించింది.

దియా యాదవ్ సీనియర్ స్థాయిలో కూడా తనదైన ముద్ర వేసింది. ఇటీవల జరిగిన సీనియర్ వీమెన్స్ ఇంటర్ జోనల్ టీ20 ట్రోఫీలో నార్త్ జోన్ తరపున ఆడింది. ఈ టోర్నమెంట్‌లో దియా 5 ఇన్నింగ్స్‌లలో 30.20 సగటుతో 151 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ దాదాపు 150గా ఉండడం విశేషం. టోర్నమెంట్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న క్రీడాకారులలో ఈమె మూడో స్థానంలో నిలిచింది. అలాగే, అత్యధిక ఫోర్లు కొట్టిన క్రీడాకారులలో దియా రెండో స్థానంలో ఉంది.

దియా మొత్తం టీ20 కెరీర్‌ను పరిశీలిస్తే, ఆమె 19 ఇన్నింగ్స్‌లలో దాదాపు 40 సగటుతో 590 పరుగులు చేసింది. ఇందులో ఆమె బ్యాట్ నుంచి 4 హాఫ్ సెంచరీలు వచ్చాయి. ఈ గణాంకాలు ఆమె ఒక అద్భుతమైన స్ట్రోక్ ప్లేయర్ అని, భవిష్యత్తులో మంచి హిట్టర్‌గా ఎదుగుతుందని నిరూపిస్తున్నాయి. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ యువ టాలెంట్‌పై పెట్టుబడి పెట్టింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..