Avi Barot: క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. సౌరాష్ట్ర యువ ఆటగాడు అవి బరోట్ శుక్రవారం (అక్టోబర్ 16) రోజున గుండెపోటుతో మరణించాడు. బ్యాట్స్‌మెన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న బరోట్ అండర్ – 19 క్రికెట్ జట్టుకు (2011) కెప్టెన్‌గా వ్యవహరించాడు. 29 ఏళ్ల వయసున్న బరోట్ అకాల మరణం చెందడంపై క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. బరోట్ మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
బరోట్ మరణ వార్తను సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్‌సీఏ) అధికారికంగా ప్రకటించింది. ఈ విషయమై.. ఈ వార్త విని ప్రతి ఒక్కరం దిగ్భ్రాంతికి గురయ్యాం. అవి బరోట్ అక్టోబరు 15 సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. సౌరాష్ట్ర క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది’ అని మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే 2019-20 సీజన్‌కు గానూ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో బరోట్ ఒకడు.
ఇక బరోట్ కెరీర్ విషయానికొస్తే.. 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 38 లిస్ట్-ఏ, 20 దేశవాళీ టీ20 మ్యాచ్‌లలో భాగస్వామ్యమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన బరోట్… ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 1547 పరుగులు, లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 1030, టీ20లలో 717 పరుగులు చేశాడు.
Also Read: India Covid-19: గుడ్‌న్యూస్.. తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. దేశవ్యాప్తంగా నిన్న ఎన్నంటే..?
Ramarao On Duty: రొమాంటిక్ మూడ్ లో’ రామారావు’.. మాస్ రాజా మూవీనుంచి అదిరిపోయే పోస్టర్..