WTC Final 2023: ఆ ప్లేయర్ల కెరీర్‌‌కి ‘టెస్ట్’ గండం.. ఫైనల్‌లో రాణిస్తేనే భవిష్యత్.. లేదంటే కథ కంచికే..!

|

Jun 07, 2023 | 7:46 PM

WTC Final 2023: అంతా ఎదురు చూసిన ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టెస్ట్ క్రికెట్ ప్రపంచ విజేతగా నిలిచేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు బరిలోకి దిగాయి. ముందుగా టాస్ గెలిచిన భారత జట్టు సారథి రోహిత్ శర్మ తొలుత బౌలింగ్..

WTC Final 2023: ఆ ప్లేయర్ల కెరీర్‌‌కి ‘టెస్ట్’ గండం.. ఫైనల్‌లో రాణిస్తేనే భవిష్యత్.. లేదంటే కథ కంచికే..!
Team India; WTC Final
Follow us on

WTC Final 2023: అంతా ఎదురు చూసిన ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టెస్ట్ క్రికెట్ ప్రపంచ విజేతగా నిలిచేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు బరిలోకి దిగాయి. ముందుగా టాస్ గెలిచిన భారత జట్టు సారథి రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకుని, ఆపై టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. ఈ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ వంటి నెం.1 టెస్ట్ బౌలర్‌కి అవకాశం దక్కలేదు. అలాగే ఎంతో కాలం తర్వాత ఓ ముగ్గురు ఆటగాళ్లు భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో వీరికి ఇది కీలక మ్యాచ్ కానుంది. ఒక వేళ ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో వీరు కనుక ఫెయిల్ అయితే వారి కథ కంచికి చేరినట్లే. మరి ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఉమేష్ యాదవ్: ఇటీవలి కాలంలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి అద్భుతమైన ఫామ్‌తో టీమిండియా తరఫున రాణిస్తున్నారు. దీంతో ఉమేష్ యాదవ్ స్థానంపై ఎప్పటికప్పుడు గండంగా మారుతూ వచ్చింది. కానీ ఐపీఎల్‌ 16వ సీజన్ కంటే ముందుగానే జస్ప్రీత్ బుమ్రా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఉమేష్‌కి భారత్ తరఫున డబ్య్లూటీసీ ఫైనల్ ఆడే అవకాశం దక్కింది. అయితే ఇటీవల ఆసీస్ జట్టులో స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టుల్లో ఆడిన ఉమేష్ కేవలం మూడు వికెట్లే తీసుకున్నాడు. ఈ పరిస్థితిలో పేసర్లకు అనుకూలించే ఇంగ్లండ్‌ పిచ్‌లో కూడా ఉమేష్ ఫెయిలైతే.. భవిష్యత్తులో అతనికి భారత్ తరఫున ఆడే అవకాశం దొరకడం కష్టమే.

అజింక్య రహానే: భారత్ తరఫున విదేశాల్లో అద్భుతంగా రాణించిన బ్యాటర్లలో రహానే ఒకడు. కానీ గతేడాది జరిగిన సౌతాఫ్రికా సిరీస్ తర్వాత రహానేని జట్టు నుంచి తీసేశారు. ఈ క్రమంలోనే వరుసగా విఫలం అవుతున్న అతను.. దేశివాళీ క్రికెట్‌లో తన సత్తా ఏమిటో నిరూపించుకోవలసిన వచ్చింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో అతను చెన్నై టీమ్ తరఫున మెరుగ్గా రాణించాడు. ఈ కారణంగానే మళ్లీ భారత్ తరఫున ఆడే అవకాశం పొందగలిగాడు. కానీ అతను ఈ ఫైనల్ మ్యాచ్‌లో విఫలమైతే తన కెరీర్‌ని చేజేతులా ముగించేసుకున్నట్లే అవుతుంది.

ఇవి కూడా చదవండి

శార్దూల్ ఠాకూర్: ఓవల్ మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన శార్దుల్ ఠాకూర్‌కి కూడా డబ్య్లూటీసీ ఫైనల్ చాలా కీలకం. ఇప్పటివరకు 8 టెస్టులే ఆడిన శార్దుల్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఇది తనకు జీవితంలో ఒకేసారి దక్కే అవకాశమని పేర్కొన్నాడు. ఈ క్రమంలో అతను తప్పక రాణించాల్సి ఉంది. లేదంటే టీమిండియా తరఫున అతని భవితవ్యం ముగిసినట్లే అవుతుంది. కాగా, అంతకముందు ఓవల్ మైదానంలో ఆడిన శార్దూల్.. 117 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..