
WPL 2027 Schedule: మహిళల క్రికెట్లో అత్యంత ఆదరణ పొందుతున్న టోర్నీల్లో ఒకటైన విమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఐదో సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నవంబర్ 4న ప్రకటించింది. మొత్తం 22 మ్యాచ్‌లతో మూడు వారాల పాటు క్రికెట్ సందడి కొనసాగనుంది. జనవరి 14న ప్రారంభమయ్యే ఈ టోర్నీ ఫిబ్రవరి 7న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.
WPL 2027 ప్రారంభ మ్యాచ్‌లోనే అభిమానులకు భారీ పోటీ ఎదురుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు (RCB Women), రెండుసార్లు టైటిల్ విజేత ముంబై ఇండియన్స్ మహిళల జట్టుతో (Mumbai Indians Women) తలపడనుంది. జనవరి 14న రాత్రి 7:30 గంటలకు వడోదరలోని కొటాంబి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఈసారి WPL మ్యాచ్‌లకు రెండు వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి 11 మ్యాచ్‌లు గుజరాత్‌లోని వడోదర కొటాంబి స్టేడియంలో జరుగుతాయి. జనవరి 26 నుంచి ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (CCI) రెండో దశ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఎలిమినేటర్ ఫిబ్రవరి 5న, ఫైనల్ ఫిబ్రవరి 7న ముంబైలోనే జరగనున్నాయి. లీగ్ దశలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో పోటీపడతాయి.
| మ్యాచ్ | తేదీ | జట్లు | వేదిక |
|---|---|---|---|
| 1 | జనవరి 14 | RCB vs MI | వడోదర |
| 2 | జనవరి 15 | GG vs UPW | వడోదర |
| 3 | జనవరి 16 | DC vs RCB | వడోదర |
| 4 | జనవరి 17 | UPW vs MI | వడోదర |
| 5 | జనవరి 18 | GG vs DC | వడోదర |
| 6 | జనవరి 19 | RCB vs UPW | వడోదర |
| 7 | జనవరి 20 | GG vs MI | వడోదర |
| 8 | జనవరి 21 | UPW vs DC | వడోదర |
| 9 | జనవరి 22 | GG vs RCB | వడోదర |
| 10 | జనవరి 23 | DC vs MI | వడోదర |
| 11 | జనవరి 24 | UPW vs GG | వడోదర |
| 12 | జనవరి 26 | MI vs RCB | ముంబై |
| 13 | జనవరి 27 | DC vs GG | ముంబై |
| 14 | జనవరి 28 | MI vs UPW | ముంబై |
| 15 | జనవరి 29 | RCB vs DC | ముంబై |
| 16 | జనవరి 30 | MI vs GG | ముంబై |
| 17 | జనవరి 31 | UPW vs RCB | ముంబై |
| 18 | ఫిబ్రవరి 1 | MI vs DC | ముంబై |
| 19 | ఫిబ్రవరి 2 | RCB vs GG | ముంబై |
| 20 | ఫిబ్రవరి 3 | DC vs UPW | ముంబై |
| 21 | ఫిబ్రవరి 5 | ఎలిమినేటర్ | ముంబై |
| 22 | ఫిబ్రవరి 7 | ఫైనల్ | ముంబై |
అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు (IST) ప్రారంభమవుతాయి.
WPL 2027 వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలిన్యూ (Sophie Molineux) అత్యధిక ధర దక్కించుకుంది. యూపీ వారియర్జ్ ఆమెను రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. కిరణ్ నవ్‌గిరే, జీ కమలిని, జెస్ జొనాసెన్ కూడా వేలంలో భారీ ధరలు అందుకున్నారు. మరోవైపు యువ క్రికెటర్ ఉమా కశ్వి వేలంలో ఎంపికైన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.
1. ఢిల్లీ క్యాపిటల్స్: అన్నాబెల్ సదర్లాండ్, చినెల్ హెన్రీ, దియా యాదవ్, జెమిమా రోడ్రిగ్స్, లారా వోల్వార్డ్ట్, లూసీ హామిల్టన్, మమతా మడివాలా, మారిజాన్ కాప్, మిన్ను మణి, నందిని శర్మ, నికీ ప్రసాద్, షఫాలీ వర్మ, శ్రీ చరణి, కిరణ్ నవ్‌గిరే, ఉమా కశ్వి, క్రిస్టీ గోర్డన్, నజ్మా ఖాన్.
2. గుజరాత్ జెయింట్స్: అనుష్క శర్మ, యాష్లే గార్డ్నర్, బెత్ మూనీ, భారతి ఫుల్మాలి, జార్జియా వేర్హామ్, హ్యాపీ కుమారి, జింటిమణి కలిత, కనికా అహుజా, కశ్వీ గౌతమ్, కిమ్ గార్త్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, సోఫీ డివైన్, తనూజా కన్వర్, యస్తికా భాటియా, జీ కమలిని, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, సమైరా రాఘవ్.
3. ముంబై ఇండియన్స్: అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, నటాలీ స్కివర్-బ్రంట్, నికోలా క్యారీ, రహీలా ఫిర్దౌస్, సజీవన్ సజనా, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, వైష్ణవి శర్మ, తారా నోరిస్, దిశా కసత్, లతికా ఇనామ్దార్, భారతి రావల్, సానికా చాల్కే, అక్షితా భగత్, శ్వేతా సెహ్రావత్.
4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: అరుంధతి రెడ్డి, ఎల్లీస్ పెర్రీ, జార్జియా వోల్, లారెన్ బెల్, నాడిన్ డి క్లెర్క్, పూజా వస్త్రాకర్, ప్రత్యూష కుమార్, ప్రేమ రావత్, రాధా యాదవ్, రిచా ఘోష్, సయాలి సట్ఘరే, శ్రేయాంక పాటిల్, స్మృతి మంధాన, జెస్ జొనాసెన్, తేజల్ హస్నబిస్, వృందా దినేశ్, క్లోయ్ ట్రయాన్.
5. యూపీ వారియర్జ్: దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ప్రతికా రావల్, శిఖా పాండే, షిప్రా గిరి, సిమ్రన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, సోఫీ మోలిన్యూ, స్నేహ్ రాణా, గ్రేస్ హారిస్, సుష్మా వర్మ, క్యాథరిన్ బ్రైస్, మనాలి దక్షిణి, సహనా పవార్, ఆశా శోభన.
డిఫెండింగ్ ఛాంపియన్ RCB మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది. ముంబై ఇండియన్స్ కూడా బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ కూడా వేలం తర్వాత తమ జట్లను పటిష్టం చేసుకున్నాయి. జనవరి 14న ప్రారంభమయ్యే ఈ పోరులో ఏ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందో చూడాలి.