WPL 2026 Full Schedule : WPL 2026 షెడ్యూల్‌లో ట్విస్ట్.. ఫస్ట్ టైం సెలవు రోజున కాకుండా ఫైనల్ ఫిక్స్ చేసిన మెనేజ్మెంట్

బీసీసీఐ తాజాగా మహిళా ప్రీమియర్ లీగ్ 2026 షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మెగా ఆక్షన్ తర్వాత విడుదలైన షెడ్యూల్‌లో ఒక అంశం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేమిటంటే ఈ భారీ లీగ్ ఫైనల్ మ్యాచ్.. సెలవు రోజు కాకుండా, వారంలో వర్కింగ్ డేలో జరగనుంది.

WPL 2026 Full Schedule : WPL 2026 షెడ్యూల్‌లో ట్విస్ట్.. ఫస్ట్ టైం సెలవు రోజున కాకుండా ఫైనల్  ఫిక్స్ చేసిన మెనేజ్మెంట్
Wpl 2026 Full Schedule

Updated on: Nov 29, 2025 | 2:49 PM

WPL 2026 Full Schedule : బీసీసీఐ తాజాగా మహిళా ప్రీమియర్ లీగ్ 2026 షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మెగా ఆక్షన్ తర్వాత విడుదలైన షెడ్యూల్‌లో ఒక అంశం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేమిటంటే ఈ భారీ లీగ్ ఫైనల్ మ్యాచ్.. సెలవు రోజు కాకుండా, వారంలో వర్కింగ్ డేలో జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ ఫిబ్రవరి 3 (మంగళవారం) నాడు, ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 5 (గురువారం) నాడు జరగనున్నాయి. ఈసారి టోర్నమెంట్ కేవలం నవీ ముంబై, వడోదరాలలో మాత్రమే నిర్వహించనున్నారు.

మొత్తం 28 రోజుల పాటు జరిగే ఈ డబ్ల్యూపీఎల్ సీజన్‌లో 22 మ్యాచ్‌లు ఆడతారు. కేవలం రెండు డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) మ్యాచ్‌లు మినహా, మిగిలిన అన్ని మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. టోర్నమెంట్ మొదటి భాగం, మొదటి రెండు డబుల్ హెడర్ మ్యాచ్‌లకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. ఆ తర్వాత టోర్నమెంట్‌లో రెండో భాగం, ప్లేఆఫ్‌లు, ఫైనల్ మ్యాచ్‌తో సహా అన్నీ వడోదరాలో నిర్వహిస్తారు.

డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ మొత్తం 28 రోజుల్లో 22 మ్యాచ్‌లతో నవీ ముంబై, వడోదర వేదికల్లో జరుగుతుంది. టోర్నమెంట్ జనవరి 9, 2026 న ప్రారంభమై, ఫిబ్రవరి 5, 2026 న ముగుస్తుంది.

నవీ ముంబై (డీవై పాటిల్ స్టేడియం) మ్యాచ్‌లు

జనవరి 9: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 10: యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (డబుల్ హెడర్)

జనవరి 10: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 11: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్

జనవరి 12: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్

జనవరి 13: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్

జనవరి 14: యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 15: ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్స్

జనవరి 16: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్

జనవరి 17: యూపీ వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (డబుల్ హెడర్)

జనవరి 17: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

వడోదర మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్, ఫైనల్

జనవరి 19: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 20: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్

జనవరి 22: గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్

జనవరి 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 26: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్

జనవరి 27: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 29: యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 30: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్

ఫిబ్రవరి 1: ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్

ప్లేఆఫ్స్, ఫైనల్ (వడోదర)

ఫిబ్రవరి 3 (మంగళవారం): ఎలిమినేటర్ మ్యాచ్

ఫిబ్రవరి 5 (గురువారం): ఫైనల్ మ్యాచ్

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..