
Royal Challengers Bangaluru vs Gujarat Giants: మహిళల ప్రీమియర్ లీగ్ 2025 ఈరోజు అంటే ఫిబ్రవరి 14న ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సస్ గుజరాత్ జెయింట్స్ మధ్య జరుగుతుంది. వడోదరలో జరిగే ఈ మ్యాచ్‌లో మహిళా క్రికెట్‌లోని అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఒకవైపు బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన, ఆలిస్ పెర్రీ వంటి స్టార్ ప్లేయర్లు ఉంటారు. మరోవైపు, శుభమాన్ గిల్ స్నేహితురాలు హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్నర్, డియాండ్రా డాటిన్ వంటి స్టార్ ఆటగాళ్ళు రంగంలోకి దిగనున్నారు.
స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆమె గత సీజన్‌లో తన జట్టుకు టైటిల్‌ను కూడా అందించింది. అదే ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. కానీ, గుజరాత్ జెయింట్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లే గార్డనర్ వారికి ఇబ్బంది కలిగించవచ్చు. గార్డనర్ ఎల్లప్పుడూ మంధానపై ఆధిపత్యం చెలాయించింది. ఆర్సీబీ కెప్టెన్‌కు ఆమెపై అంతమంచి రికార్డు లేదు. టీ20లు, వన్డేలలో చాలాసార్లు అవుట్ అయింది. అందువల్ల ఇరుజట్ల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది.
ఈ ఇద్దరు ఆటగాళ్లతో పాటు, అందరి దృష్టి బెంగళూరుకు చెందిన ఆలిస్ పెర్రీ, గుజరాత్‌కు చెందిన హర్లీన్ డియోల్‌పై ఉంటుంది. ఇద్దరూ తమ తమ జట్లకు ముఖ్యమైన ఆటగాళ్ళు. పెర్రీ గాయం నుంచి తిరిగి వస్తోంది. గత సీజన్‌లో బెంగళూరు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. గుజరాత్ తరపున 3వ స్థానంలో ఆడిన హర్లీన్, గాయం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చి సెంచరీతో సత్తా చాటింది. ఆమె గొప్ప ఫామ్‌లో ఉంది. ఆమె నుంచి ఓ తుఫాన్ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.
అనుభవజ్ఞురాలైన వెస్టిండీస్ ఆల్ రౌండర్ డియాండ్రా డాటిన్ గుజరాత్ జెయింట్స్ కు పెద్ద మ్యాచ్ విన్నర్, గేమ్ ఛేంజర్ అని నిరూపించుకోగలదు. 4వ స్థానంలో బ్యాటింగ్ చేయడమే కాకుండా, బౌలింగ్‌లో కూడా ఆమె ప్రావీణ్యం కలిగి ఉంది. గత సంవత్సరం, ఆమె మహిళల T20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసింది. కేవలం 5.42 ఎకానమీతో 5 వికెట్లు తీసింది.
డియాండ్రా ఇన్నింగ్స్‌ను మార్చే సామర్థ్యం కలిగి ఉంది. మరోవైపు, బెంగళూరు వికెట్ కీపర్ రిచా ఘోష్ తుఫాన్ బ్యాటింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఆర్డర్‌లో వేగంగా ఆడటం, మ్యాచ్‌లను ముగించడం ద్వారా ప్రసిద్ధి చెందింది. రిచా తన బ్యాటింగ్‌తో ఎప్పుడైనా ఆటను మలుపు తిప్పగలదు. గత సీజన్‌లో బెంగళూరు తరపున ఆకట్టుకుంది.
ఇక రెండు జట్ల రికార్డుల గురించి మాట్లాడితే.. WPLలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్లు 4 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో బెంగళూరు 2 మ్యాచ్‌ల్లో, గుజరాత్ 2 మ్యాచ్‌ల్లో గెలిచాయి. అంటే ఇరజట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
వడోదర పిచ్ ఇప్పుడు కొత్తగా ఉంది. కాబట్టి బ్యాట్స్‌మెన్ ప్రారంభంలో ఆడటానికి పెద్దగా ఇబ్బంది పడరు. అయితే, మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కొంత సహాయం లభించవచ్చు. వడోదరలో సాయంత్రం వేళల్లో వాతావరణం వేడిగా ఉంటుందని అంచనా. నివేదిక ప్రకారం, ఆకాశం స్పష్టంగా ఉంటుంది. వర్షం పడే అవకాశం లేదు.
స్మృతి మంధాన (కెప్టెన్), డానీ వ్యాట్ హాడ్జ్, ఎస్ మేఘన, ఆలిస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాఘవి బిష్ట్, కనికా అహుజా, జార్జియా వారేహమ్, జాగర్వి పవార్, కిమ్ గార్త్, రేణుకా సింగ్ ఠాకూర్.
బెత్ మూనీ (wk), లారా వూల్వార్డ్, హర్లీన్ డియోల్, డియాంద్ర డాటిన్, దయాలన్ హేమలత, ఆష్లే గార్డ్నర్ (c), సిమ్రాన్ షేక్, సయాలి, సత్ఘరే, మేఘనా సింగ్, తనుజా కన్వర్, కాశ్వి గౌతమ్, షబ్నం షకీల్/మన్నత్ కశ్యప్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..