
క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం పల్లెకల్లె వేదికగా రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్, బాబర్ ఆజామ్ పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఆ ముప్పు తక్కువేనని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం పల్లెకల్లెలో వాతావరణం బాగుందని.. గాలులు బలంగా వీస్తుండటంతో వర్షాన్ని కలిగించే మేఘాలు ఎక్కువసేపు ఒకే చోట ఉండే అవకాశం తక్కువని.. వాతావరణ శాఖ తెలిపింది.
పాకిస్తాన్‌తో కీలక పోరుకు టీమిండియా తుది జట్టు దాదాపుగా ఖరారైంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టనుండగా.. మిడిలార్డర్ బ్యాటింగ్‌ను విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ చూసుకోనున్నారు. కెఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి రానుండగా.. అతడ్ని మిడిలార్డర్‌లో బరిలోకి దింపాలని టీం మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఇక ఆల్‌రౌండర్, ఫినిషింగ్ బాధ్యతలు హార్దిక్ పాండ్యా చూసుకోనుండగా.. మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా కూడా తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు. ఇందులో హార్దిక్, శార్దూల్ పేస్ ఎటాక్ చూసుకుంటే.. స్పిన్‌కి జడేజా నేతృత్వం వహిస్తాడు. ఇక మరో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, చివర్లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బాధ్యతలు చేపట్టవచ్చు. మరోవైపు మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే పాకిస్థాన్ తన తుది జట్టును ప్రకటించింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌కు ఏ జట్టయితే బరిలోకి దిగిందో.. ఆ ప్లేయింగ్ ఎలెవన్ భారత్‌తోనూ తలబడనుంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఫకర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
Pakistan to field same playing XI tomorrow 🇵🇰#PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/qe18Ad6pF4
— Pakistan Cricket (@TheRealPCB) September 1, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..